Baahubali: ప్రపంచ యానిమేషన్ వేదికపై ‘బాహుబలి’.. రాజమౌళి ఖాతాలో మరో అరుదైన రికార్డు!
Baahubali: ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్’ యానిమేషన్ చిత్రం ప్రతిష్టాత్మక ఎన్నేసి ఫెస్టివల్ 2026కు ఎంపికైంది.
Baahubali: ప్రపంచ యానిమేషన్ వేదికపై ‘బాహుబలి’.. రాజమౌళి ఖాతాలో మరో అరుదైన రికార్డు!
Baahubali: ఎస్.ఎస్. రాజమౌళి క్రియేట్ చేసిన 'బాహుబలి' మ్యాజిక్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 2027లో విడుదల కానున్న యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్’ (Baahubali: The Eternal War) అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఫ్రాన్స్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ఎన్నేసి ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ 2026 (Annecy) లో ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగంలో ప్రదర్శనకు ఈ చిత్రం అధికారికంగా ఎంపికైంది.
ఈ మైలురాయిపై రాజమౌళి సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ.. "యానిమేషన్ అనేది హద్దులు లేని ప్రపంచం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యానిమేషన్ వేదికపై మన సినిమాను ప్రదర్శించే అవకాశం రావడం భారతీయ సినిమాకు దక్కిన గౌరవం" అని పేర్కొన్నారు.
ఆర్కా మీడియా వర్క్స్ దాదాపు రూ.120 కోట్ల భారీ వ్యయంతో ఈ యానిమేషన్ వండర్‌ను నిర్మిస్తోంది. అమరేంద్ర బాహుబలి మరణం తర్వాత మాహిష్మతి రాజ్యంలో చోటుచేసుకునే యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. ఎన్నేసి ఫెస్టివల్‌ను యానిమేషన్ రంగంలో ‘కేన్స్ ఫెస్టివల్’గా పరిగణిస్తారు. భారతీయ యానిమేషన్ స్థాయిని ఇది ప్రపంచానికి చాటిచెప్పనుంది.




