Balakrishna Viral Train Scene: తొడకొడితే ట్రైన్‌ ఎలా వెనక్కి వెళ్లిందో ఇప్పటికీ ఆశ్చర్యమేనంటున్న బాలయ్య

Balakrishna Viral Train Scene: నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో చేసిన కొన్ని సినిమాల్లోని సన్నివేశాల గురించి ప్రేక్షకులు ఇప్పటికీ పలు రకాలుగా చర్చించుకుంటూనే ఉంటారు.

Balachander
Published on: 10 April 2026 10:20 AM IST
Balakrishna Viral Train Scene
X

Balakrishna Viral Train Scene

Balakrishna Viral Train Scene: నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో చేసిన కొన్ని సినిమాల్లోని సన్నివేశాల గురించి ప్రేక్షకులు ఇప్పటికీ పలు రకాలుగా చర్చించుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా ఎవరూ చేయని, చేయలేని సన్నివేశాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో వచ్చిన ట్రైన్‌ సీన్‌.

ఆ సీన్‌ ఇప్పటికీ ఆశ్చర్యమే

బాలయ్య సినిమా అంటే పవర్‌ఫుల్‌ డైలాగులు, అంతకు మించి మాస్‌ యాక్షన్‌. ఇందులోనూ కొన్ని యాక్షన్‌ సీన్లు లాజిక్‌కు అందకుండా ఉంటాయి. ఆ సీన్స్‌ను ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేసిన దానికంటే ట్రోల్‌ చేసినవే ఎక్కువగా ఉంటాయి. అందులో ఒకటి పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలోని ట్రైన్‌ సీన్‌. బాలయ్య తొడకొడితే ట్రైన్‌ వెనక్కి వెళ్తుంది. పక్కా మాస్‌ యాక్షన్‌ సినిమా కాబట్టి ఆ సీన్‌ యాక్షన్‌లో భాగంగా కొట్టుకుపోయింది. కానీ, లాజిక్‌కి దూరంగా ఊహకి అందకుండా తీసిన ఈ సీన్‌పై ఆరోజుల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై బాలయ్య కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

తొడ కొడితే ట్రైన్‌ వెనక్కి వెళ్లడం ఏంటని తనను కొందరు ఇప్పటికీ అడుగుతుంటారని బాలయ్య నవ్వుతూ చెబుతారు. షూటింగ్‌ సమయంలో చేస్తున్న పాత్ర ప్రభావంతో, దాని స్వభావం మేరకు ఆ సీన్‌ చేస్తున్నా ఏమీ అనిపించలేదని, సినిమా రిలీజ్‌ అయ్యాక ఆ సీన్‌ చూస్తే కాస్త ఇబ్బందిగా అనిపించిందని నిజాయితీగా చెప్పడం బాలయ్యకే సాధ్యం. రచయితలు ఆ సీన్‌ను ఎందుకు రాశారో..తాను ఎందుకు ఆ సీన్‌ చేశానో..దర్శకుడు బి గోపాల్‌ ఎలా తీశారో ఇప్పటికీ అర్ధంకాదని బాలయ్య చెప్పడం విశేషం. ఆరోజుల్లో మాస్‌ ఎలిమెంట్స్‌, హీరో యాక్షన్‌ సీన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ఉండేది. అప్పటి తీరును బట్టి అలా చేయవలసి వచ్చిందని, కానీ ఇప్పటి తీరును అనుసరించి కథల్లో మార్పులు చేసుకుంటూ, సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నానని బాలయ్య చెప్పుకొచ్చారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story