Nandamuri Tejaswini: బాలయ్య చిన్న కూతురు డ్యాన్స్ చూశారా..! హీరోయిన్లు కూడా సరిపోరు సామి!

Nandamuri Tejaswini: నందమూరి నటసింహం బాలకృష్ణ వారసులుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోయేది ఎవరు?

Naresh.k
Updated on: 13 July 2026 2:20 PM IST
Nandamuri Tejaswini
X

Nandamuri Tejaswini: బాలయ్య చిన్న కూతురు డ్యాన్స్ చూశారా..! హీరోయిన్లు కూడా సరిపోరు సామి

Balayya: నందమూరి నటసింహం బాలకృష్ణ వారసులుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోయేది ఎవరు? ఈ ప్రశ్నకు అందరి నుంచి వినిపించే ఒకే ఒక్క పేరు.. మోక్షజ్ఞ. కానీ, ప్రస్తుతం వెండితెరపై కనిపించకుండానే నందమూరి అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకుడి దృష్టిని సైతం ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నారు బాలయ్య చిన్న కూతురు తేజస్విని. గత కొద్ది రోజులుగా నెట్టింట తేజస్విని పేరు మారుమోగిపోతోంది. కేవలం నందమూరి ఇంటి ఆడపడుచు అనే ట్యాగ్‌తోనే కాకుండా, తనలోని అద్భుతమైన టాలెంట్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారామె.

ఇటీవల ఓ అదిరిపోయే డాన్స్ వీడియోతో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన తేజస్విని, ఆ వేడి తగ్గకముందే మరో క్రేజీ డాన్స్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. టాలీవుడ్ డాన్స్ క్వీన్ సాయిపల్లవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్ సాంగ్ అయిన 'సారంగ దరియా' పాటకు తేజస్విని వేసిన గ్రేస్‌ఫుల్ స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పక్కా ప్రొఫెషనల్ డాన్సర్‌లాగా తేజస్విని ఇచ్చిన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఈమె డాన్స్ గ్రేస్ చూస్తుంటే ఏకంగా సాయి పల్లవికే గట్టి కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది అంటూ నందమూరి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె బాడీ లాంగ్వేజ్, కళ్ళతో పలికించిన ఎక్స్‌ప్రెషన్స్ చూసిన వారంతా బాలయ్య బాబులోని డాన్స్ మాస్ ఎనర్జీ చిన్న కూతురికి పుణికిపుచ్చుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తేజస్విని కేవలం రీల్స్, డాన్స్ వీడియోలకే పరిమితం కాలేదు. నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన అత్యంత కీలకమైన బాధ్యతలను సైతం తన భుజాలపై వేసుకుని రియల్ పవర్‌హౌస్ అనిపించుకుంటున్నారు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'NBK-111' సినిమాకు తేజస్విని ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా నిర్మాణ పనులను ఆమె అత్యంత ప్రతిష్టాత్మకంగా చూసుకుంటున్నారు.

అటు కోట్లాది రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాల ప్రొడక్షన్ పనులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఇటు తనలోని ఆర్టిస్ట్‌ను దాచుకోకుండా, డాన్స్ టాలెంట్‌తో సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు తేజస్విని. స్క్రీన్ వెనుక నిర్మాతగా పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తూ, సోషల్ మీడియాలో తన డాన్స్‌తో అందరినీ మైమరపిస్తున్న తేజస్విని క్రేజ్ రోజురోజుకూ మరింత పెరిగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.



Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story