Bandla Ganesh: మామను మించిన అల్లుడు.. బండ్లన్న కాబోయే అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.?

Bandla Ganesh: టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగేందుకు సిద్ధమవుతోంది.

Mokshith
Published on: 5 April 2026 2:42 PM IST
Bandla Ganesh Daughter Wedding Who Is His Future Son in Law Suryateja Chilukuri Background Details
X

Bandla Ganesh: మామను మించిన అల్లుడు.. బండ్లన్న కాబోయే అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.?

Bandla Ganesh: టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగేందుకు సిద్ధమవుతోంది. ఆయన కుమార్తె జనని బండ్ల త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు స్వయంగా బండ్ల గణేశ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మొదలైన పెళ్లి ఏర్పాట్లు

బండ్ల గణేశ్ కుమార్తె జనని, సూర్యతేజ చిలుకూరి అనే యువకుడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కుటుంబ సభ్యుల మధ్య ప్రారంభమయ్యాయి. ఇటీవల బండ్ల గణేశ్ నివాసంలో సంప్రదాయబద్ధంగా పసుపు–కుంకుమ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో బండ్ల గణేశ్ కుటుంబ సభ్యులతో పాటు వరుడి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేస్తూ దేవుని ఆశీస్సులు, పెద్దల దీవెనలతో తమ ఇంట్లో త్వరలో శుభకార్యం జరగబోతుందని తెలిపారు. అలాగే పసుపు–కుంకుమ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ చిత్రాల్లో వధూవరులతో పాటు రెండు కుటుంబాల సభ్యులు కనిపిస్తున్నారు.

బండ్ల గణేశ్‌కు కాబోయే అల్లుడు ఎవరు?

జనని వివాహం వార్త బయటకు వచ్చిన తర్వాత సూర్యతేజ చిలుకూరి గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బండ్ల గణేశ్ అల్లుడి రేంజ్ ఏంటన్న క్యూరియాసిటీ అందరలోనూ మొదలైంది. అయితే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వరుడి కుటుంబం రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్యతేజకు కూడా పెద్ద ఎత్తున‌ ఆస్తులు ఉన్నాయని స‌మాచారం. అయితే ఆయన వ్యక్తిగత వివరాలు, వృత్తి గురించి పూర్తి సమాచారం ఇంకా బయటకు రాలేదు. ఆయన వ్యాపార రంగంలో ఉన్నారా లేదా ఉద్యోగం చేస్తున్నారా అనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే మొత్తం మీద బండ్ల‌న్న‌కు కాబోయే అల్లుడు పెద్ద సౌండ్ పార్టీ అంటూ అభిమానులు ఫ‌న్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే బండ్ల గ‌ణేశ్ కెరీర్ విష‌యానికొస్తే ఇటీవ‌ల సినిమాల్లో క‌నిపించ‌డం త‌గ్గించారు. తాజాగా హైద‌రాబాద్ నుంచి కాలిన‌డ‌క‌న‌ తిరుమ‌ల వెళ్లి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన బండ్ల గ‌ణేశ్ ప్ర‌స్తుతం.. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారని టాక్ న‌డుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story