పవన్ కళ్యాణ్ వివాదం.. ప్రకాష్ రాజ్‌కు బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్!

Bandla Ganesh: పవన్ వ్యాఖ్యలను అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతుండగా.. జనసైనికులు వారికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.

Srinivas Rao
Published on: 4 Jun 2026 12:47 PM IST
Bandla Ganesh
X

పవన్ కళ్యాణ్ వివాదం.. ప్రకాష్ రాజ్‌కు బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్!

Bandla Ganesh: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా, సామాజికంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలను అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతుండగా.. జనసైనికులు వారికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ ఇష్యూతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. అయితే, ఈ వివాదంలోకి జాతీయ ఉత్తమ నటుడు, సామాజిక వేత్త ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇవ్వడం.. ఆయనకు పవన్ కళ్యాణ్ వీరాభిమాని, నటుడు-నిర్మాత బండ్ల గణేష్ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇవ్వడంతో ఈ వ్యవహారం టాలీవుడ్‌లో సరికొత్త రచ్చకు దారితీసింది.

https://twitter.com/ganeshbandla/status/2062401489939915182

‘రండి దొర.. కానీ ఎలా వస్తున్నారు?’: ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు

తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ రాకను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యంగ్యంగా స్పందించారు.

ప్రకాష్ రాజ్ పోస్ట్: "మీరొస్తానంటే మేమొద్దంటామా? రండి దొర... కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగిల్‌గా వస్తున్నారా?" అంటూ పవన్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు.

‘అసలు నువ్వెవడివిరా?’.. బండ్ల గణేష్ మైండ్ బ్లోయింగ్ కౌంటర్!

ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్ట్‌పై పవన్ కళ్యాణ్‌ను తన ‘దేవుడు’గా భావించే బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకాష్ రాజ్‌ను ఏకవచనంతో సంబోధిస్తూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా చెడుగుడు ఆడేసుకున్నారు.

"నీకెందుకురా... ప్రతిదాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!" అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

కాంగ్రెస్ విధేయుడైనా.. ‘బాస్’ విషయానికొస్తే తగ్గేదేలే!

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బండ్ల గణేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి సానుభూతిపరుడిగా, ఆ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ తన ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పటికీ.. బండ్ల గణేష్ వాటన్నింటినీ పక్కన పెట్టేసి, తన ‘బాస్’ పవన్ కళ్యాణ్ కోసం ప్రకాష్ రాజ్‌పై యుద్ధానికి దిగడం గమనార్హం.

పరిశ్రమను విభజించొద్దు: నిర్మాత రాంకీ ఆగ్రహం

మరోవైపు, పవన్ కళ్యాణ్‌పై సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమ నాయకుడు పాశం యాదగిరి చేసిన వ్యాఖ్యలను కూడా టాలీవుడ్ వర్గాలు ఖండిస్తున్నాయి. నిర్మాత, నటుడు రాంకీ ఈ విషయమై స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్‌ను అడ్డం పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్తతలు సృష్టించడం సరికాదన్నారు. రాజకీయాల కోసం తెలుగు సినిమా రంగాన్ని ప్రాంతాల వారీగా విభజించాలని చూడటం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ తుఫాను.. ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఇండస్ట్రీ వివాదంగా మారిపోయింది. మరి బండ్ల గణేష్ ఇచ్చిన ఈ రేంజ్ కౌంటర్‌పై ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి!




Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story