Bandla Ganesh: బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష.. ఎందుకంటే..?
Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు ఒంగోలు కోర్టులో చుక్కెదురైంది.
Bandla Ganesh: బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష.. ఎందుకంటే..?
Bandla Ganesh cheque bounce case: నా ప్రాణం నీ ఇష్టం బాస్ అంటు పవన్ కల్యాణ్ అభిమానులను ఉర్రూతలూగించే టాలీవుడ్ ఫైర్ బ్రాండ్, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎప్పుడూ తన హైప్రిటేషన్ స్పీచ్‌లతో, వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే బండ్ల గణేష్‌కు తాజాగా ఒంగోలు కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఓ చెక్ బౌన్స్ కేసులో ఆయనకు కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
ఆర్థిక లావాదేవీల నిమిత్తం బండ్ల గణేష్ బాధితుడికి ఓ చెక్ ఇచ్చారు. అయితే, ఖాతాలో తగిన నిల్వలు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో మోసపోయిన బాధితుడు న్యాయం కోసం ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సుదీర్ఘకాలం పాటు విచారణ జరిపిన న్యాయస్థానం..బండ్ల గణేష్‌పై నేరం రుజువు అయినట్లు నిర్ధారించింది.
ఈ క్రమంలోనే ఆయనకు ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాకుండా, కేసు విచారణ నిమిత్తం బాధితుడికి అయిన కోర్టు ఖర్చులను కూడా బండ్ల గణెషే భరించాలని న్యాయమూర్తి స్పష్టం చేయడం గమనాహారం.
బండ్ల గణేష్ ఆర్థిక వివాదాల్లో చిక్కుకోవడం, చెక్ బౌన్స్ కేసులు నమోదు కావడం టాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. గతంలోనూ పలు చెక్ బౌన్స్ కేసుల్లో వివిధ కోర్టులు ఆయనకు జైలు శిక్షలు విధించినా, ఆయన వెంటనే పైకోర్టుల్లో అప్పీళ్లకు వెళ్లడం తెలిసిందే. అయితే, తాజాగా ఒంగోలు కోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పు టాలీవుడ్ వర్గాల్లో, సినీ ప్రముఖుల మధ్య మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




