Bandla Ganesh: వీడియోతో అడ్డంగా దొరికిపోయిన బండ్ల గణేష్
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ప్రకాష్ రాజ్ విషయంలో మాట మార్చి సోషల్ మీడియాలో అడ్డంగా బుక్ అయ్యారు.
Bandla Ganesh: వీడియోతో అడ్డంగా దొరికిపోయిన బండ్ల గణేష్
Prakash Raj: టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్’నిర్మాత బండ్ల గణేష్ అంటేనే ఒక వైబ్రేషన్. ఆయన మైక్ పట్టుకుంటే స్పీచులు ఎలా ఉంటాయో.. సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తే ఎలా పేలుతాయో అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ప్రకాష్ రాజ్ విషయంలో మాట్లాడిన రెండు రకాల మాటలు ఇప్పుడు ఆయన్ను అడ్డంగా బుక్ చేశాయి. సమయం చూసి రంగులు మార్చడంలో బండ్లన్న తర్వాతే ఎవరైనా అంటూ నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.
కొద్దిరోజుల క్రితం ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పొలిటికల్ ట్వీట్‌పై బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ వివాదంతో బండ్ల గణేష్‌కు అసలు ఎలాంటి సంబంధం లేకపోయినా.. మధ్యలో దూరి మరీ ప్రకాష్ రాజ్‌ను టార్గెట్ చేశారు. అసలు ఎవడ్రా నువ్వు? తెలుగోడివా.. తమిళోడివా? నీకేం సంబంధం? అంటూ తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. ఆ సమయంలో బండ్లన్న వ్యాఖ్యలపై ఇండస్ట్రీ వర్గాల నుంచే కాకుండా కామన్ ఆడియన్స్ నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు సోషల్ మీడియాలో బండ్ల గణేష్‌కు సంబంధించిన ఒక పాత వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ప్రకాష్ రాజ్‌పై బండ్లన్న కురిపించిన ప్రశంసల వర్షం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ వీడియోలో బండ్లన్న ఏమన్నారంటే..ప్రకాష్ రాజ్ అనే వ్యక్తిపై నాకు వందల సార్లు ఇరిటేషన్ వచ్చింది నిజమే. కానీ ఆయన గత 23 ఏళ్లుగా నాకు అత్యంత ఆప్తుడు. ప్రకాష్ రాజ్ బయటకు ఒకలా కనిపిస్తారు కానీ.. ఆయన మనసులోకి వెళ్లి చూస్తే ఒక అద్భుతమైన మనిషి కనిపిస్తారు.
ఇక్కడ పుట్టిన ప్రభాస్ ఇండియా మొత్తాన్ని ఏలుతున్నాడు, రాజమౌళిని హాలీవుడ్ పిలుస్తోంది. మరి ప్రకాష్ రాజ్ నాన్-లోకల్ ఎలా అవుతారు? ఆయన 23 ఏళ్ల క్రితమే షాద్‌నగర్‌లో స్థిరపడ్డారు. అక్కడ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఎంతో అభివృద్ధి చేశారు.
షాద్‌నగర్ వెళ్లి అడిగితే ప్రకాష్ రాజ్ గొప్పతనం చెప్తారు అంటూ నాడు ‘మా’ ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్‌కు మద్దతుగా స్పీచ్ దంచికొట్టారు. ఈ పాత వీడియో బయటకు రావడంతో నెటిజన్లు, ట్రోలర్స్ పండగ చేసుకుంటున్నారు. నాడు దేవదూత అన్న వ్యక్తిని.. నిన్న కాకమొన్న ఎవడ్రా నువ్వు అంటావా? అంటూ మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు.
బండ్లన్న పాలిటిక్స్ అంటే ఇవే మరి. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు.. అవసరం తీరిపోతే జుట్టు పట్టుకుంటాడు. సీన్ మారితే మాట మార్చడం బండ్ల గణేష్‌కు వెన్నతో పెట్టిన విద్య అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.




