Bhagyashri Borse: ఒక్క హిట్ విలువ రూ. 3 కోట్లు

Bhagyashri Borse: సినీ పరిశ్రమలో ఒక నమ్మకం ఉంది... ఒక్క సరైన సక్సెస్ పడితే చాలు.

Naresh.k
Published on: 19 July 2026 10:46 AM IST
Bhagyashri Borse
X

Bhagyashri Borse: ఒక్క హిట్ విలువ రూ. 3 కోట్లు

Bhagyashri Borse Remuneration: సినీ పరిశ్రమలో ఒక నమ్మకం ఉంది... ఒక్క సరైన సక్సెస్ పడితే చాలు.. రాత్రికి రాత్రే జాతకాలు మారిపోతాయి. ఇప్పుడు ఇదే మాటను అక్షరాలా నిజం చేసి చూపిస్తోంది టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే . మరాఠీ మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, తన గ్లామర్‌తో కుర్రకారు మనసు దోచుకున్న ఈ బ్యూటీకి ఆరంభంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి.

ఆమె నటించిన మునుపటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, ఈ బ్యూటీలోని స్పార్క్ మాత్రం మేకర్స్‌ను ఆకర్షిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ‘లెనిన్’ చిత్రం భాగ్యశ్రీ కెరీర్‌కు ఊహించని టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ సినిమా సాధించిన ఘనవిజయంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆకాశాన్నంటుతోంది.

మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో, అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘లెనిన్’ థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే ‘భారతి’ అనే ఎమోషనల్ క్యారెక్టర్‌లో జీవించేసింది. పాత్రలోని అమాయకత్వాన్ని, ఎమోషన్‌ను ఆమె పండించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

ముఖ్యంగా హీరో అఖిల్‌తో ఆమె స్క్రీన్ కెమిస్ట్రీ థియేటర్లలో మ్యాజిక్ క్రియేట్ చేసింది. చాలా కాలం తర్వాత దక్కిన ఈ భారీ విజయంతో భాగ్యశ్రీ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. సినిమా సక్సెస్ మీట్‌లో తను ఇండస్ట్రీలో పడ్డ కష్టాలను, తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమను గుర్తుచేసుకుంటూ ఆమె స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారందరినీ కదిలించింది.

'లెనిన్' సినిమా తెచ్చిన క్రేజ్‌తో భాగ్యశ్రీ బోర్సే తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది. గతంలో ఒక్కో సినిమాకు దాదాపు రూ. 1.5 కోట్ల వరకు తీసుకున్న ఈ భామ, ఇప్పుడు తన డిమాండ్‌ను పెంచేసి కొత్త ప్రాజెక్ట్‌ల కోసం సుమారు రూ. 2.5 కోట్ల నుండి రూ. 3 కోట్ల వరకు కోట్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. విశేషం ఏంటంటే.. ప్రస్తుతం ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇచ్చేందుకు వెనుకాడటం లేదట.

ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే డైరీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇప్పటికే ఆమె చేతిలో మూడు క్రేజీ తెలుగు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తమిళంలో 'సేయోన్' అనే భారీ ప్రాజెక్ట్‌తో కోలీవుడ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెడుతోంది. అయితే, ఇతర భాషల నుండి ఎన్ని ఆఫర్స్ వస్తున్నప్పటికీ..

ఈ ముద్దుగుమ్మ మాత్రం తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్‌కే తన మొదటి ప్రాధాన్యత అని తెగేసి చెప్తోంది. 'లెనిన్' ఇచ్చిన సక్సెస్ జోష్‌తో భాగ్యశ్రీ బోర్సే రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్‌గా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story