అమితాబ్ మిస్టరీ పోస్ట్‌తో తలలు పట్టుకుంటున్న నెటిజన్లు!

Amitabh Bachchan: బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక క్రిప్టిక్ సందేశం ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు నెటిజన్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Srinivas Rao
Published on: 21 May 2026 6:34 PM IST
Amitabh Bachchan
X

అమితాబ్ మిస్టరీ పోస్ట్‌తో తలలు పట్టుకుంటున్న నెటిజన్లు!

Amitabh Bachchan: బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక క్రిప్టిక్ సందేశం ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు నెటిజన్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని, ముంబైలోని ఆసుపత్రిలో చేరారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ అర్థరాత్రి ట్వీట్ రావడం విశేషం.

అర్ధరాత్రి 1 గంటకు ట్వీట్ వైరల్

ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే 83 ఏళ్ల అమితాబ్ బచ్చన్, తన ట్విట్టర్ (X) ఖాతాను డిజిటల్ డైరీలా వాడుతుంటారు. తాజాగా మే 21, 2026 అర్ధరాత్రి దాటాక 1:23 గంటలకు ఆయన తన సిగ్నేచర్ ఫార్మాట్‌లో ఒక పోస్ట్ పెట్టారు. "T 5747 - ప్రజలు అయోమయానికి గురయ్యారు; ఆలోచనలను వ్యక్తపరిచారు - ఎవరికైనా అర్థమైనా కాకపోయినా, తీసుకున్న దానికి ఇచ్చేవారిలా మారిపోయారు" అని హిందీలో రాసుకొచ్చారు. ఈ వింత పోస్ట్ కొన్ని గంటల్లోనే వేలాది వ్యూస్, వందలాది కామెంట్లతో వైరల్‌గా మారింది.

ఆసుపత్రి వార్తలకు చెక్

గత శనివారం (మే 16) నుంచి అమితాబ్ బచ్చన్ కడుపు నొప్పితో నానావతి ఆసుపత్రిలోని విఐపి వార్డులో చేరారని, అభిషేక్ బచ్చన్ కూడా పరామర్శించడానికి వచ్చారని బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే, కుటుంబ సన్నిహిత వర్గాలు ఈ వార్తలను పూర్తిగా ఖండించాయి. బిగ్ బి కేవలం తన మంత్లీ రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లారని, ఆ వెంటనే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారని స్పష్టం చేశారు. మరుసటి రోజే ఆయన తన నివాసం 'జల్సా' వెలుపల అభిమానులకు 'సండే దర్శన్' కూడా ఇచ్చారు. ఈ తప్పుడు ప్రచారాలపైనే అమితాబ్ తన శైలిలో కౌంటర్ ఇచ్చారని అభిమానులు భావిస్తున్నారు.

కల్కి 2898 ఏడీ తర్వాత క్రేజ్

బిగ్ బి రాసిన ఆలోచనలను డీకోడ్ చేయడం ఎవరి తరం కాదంటూ కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. కాగా, గతేడాది విడుదలైన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'కల్కి 2898 AD' లో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ప్రశంసలు లభించాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ప్రస్తుతం అమితాబ్ పూర్తి ఆరోగ్యంగా ఉంటూ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story