Spirit: ‘స్పిరిట్’ అప్‌డేట్: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Spirit: రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబో అనగానే సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Spirit: ‘స్పిరిట్’ అప్‌డేట్: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Spirit: రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబో అనగానే సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కలయికలో వస్తోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'స్పిరిట్' గురించిన ఓ క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో స్వయంగా సందీప్ వంగా ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. అనుకున్నదానికంటే చాలా వేగంగా షూటింగ్ జరుగుతోందని, ఇప్పటివరకు దాదాపు 40 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అనుకున్న దానికంటే సినిమా చాలా పవర్‌ఫుల్‌గా వస్తోందని, థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక ఈ చిత్రంలో ప్రభాస్ ఇప్పటివరకు చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించనున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ప్రేక్షకులను కట్టిపడేసే ఎమోషనల్ డ్రామా కూడా ఈ సినిమాలో హైలైట్ కానుందట. ఇక తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను, వచ్చే ఏడాది అంటే 2027 మార్చి 5న గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేవలం తెలుగు, హిందీలోనే కాకుండా పలు అంతర్జాతీయ భాషల్లోనూ దీన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.




