Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్‌లోకి షాలిని రీ ఎంట్రీ.. సడెన్ ఎంట్రీతో షాక్ అయిన కంటెస్టెంట్లు

ఎలిమినేట్ అయినట్లు నమ్మించి సీక్రెట్ రూమ్‌లో ఉంచిన షాలినిని బిగ్ బాస్ తిరిగి హౌస్‌లోకి పంపించడంతో సభ్యులంతా తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు.

CR Reddy
Published on: 22 Oct 2026 9:28 AM IST
Bigg Boss 10
X

Bigg Boss 10 

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ 45వ రోజు ఆట ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఎలిమినేట్ అయినట్లు నమ్మించి సీక్రెట్ రూమ్‌లో ఉంచిన షాలినిని బిగ్ బాస్ తిరిగి హౌస్‌లోకి పంపించడంతో సభ్యులంతా తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా రోహిత్ ఆమెను చూసి ఎంతో ఆనందపడ్డాడు. అయితే లోపలికి రాగానే షాలిని తన నోటికి తీవ్రంగా పని చెప్పింది. టాస్క్ సందర్భంగా దక్షిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అసభ్య పదజాలం వాడే ప్రయత్నం చేయగా తోటి సభ్యులు ఆమెను కంట్రోల్ చేశారు. ఈ రీ ఎంట్రీతో హౌస్‌లో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది.

సత్తా చాటిన రామ్ ప్రసాద్, ఝాన్సీ

హౌస్‌లోని సభ్యుల ఆటతీరు, ఆడియన్స్ ఓటింగ్‌ను బట్టి బిగ్ బాస్ వారికోసం రెడ్, ఎల్లో, గ్రీన్ లెవల్స్ అని ప్రత్యేక గేమ్ పెట్టారు. రెడ్ లెవల్‌లో ఉన్నవారు ఎల్లో కి వెళ్లడానికి బిగ్ బాస్ ఒక కఠినమైన టాస్క్ ఇచ్చారు. సర్కిల్ మధ్యలో ఉన్న బోన్ కోసం పోరాడే ఈ గేమ్‌లో ఝాన్సీ, సుధీర్, శ్వేత, రామ్ ప్రసాద్ తీవ్రంగా శ్రమించారు. దెబ్బలు తగులుతున్నా వెనక్కు తగ్గకుండా ఆడారు. చివరికి ఫైనల్ రౌండ్‌లో సింగర్ ఝాన్సీపై విజయం సాధించి రామ్ ప్రసాద్ రెడ్ లెవల్ నుంచి ఎల్లో లెవల్‌కి ప్రమోట్ అయ్యాడు.

ఓటింగ్ ట్రెండ్స్‌లో మార్పులు

ఈ వారం నామినేషన్లలో ఏకంగా 12 మంది నిలవడంతో ఓటింగ్ సరళిలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగిన రోహిత్ ఓటింగ్ శాతం షాలిని రీ ఎంట్రీ, ఆయన ప్రవర్తన వల్ల హఠాత్తుగా తగ్గిపోయింది. ప్రస్తుతం రోహిత్ 25 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, త్రిగుణ్ 24 శాతం ఓట్లతో ఆయనకు అతి సమీపంలోకి వచ్చేశాడు. రోహిత్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటమే ఆయన గ్రాఫ్ పడిపోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

డబుల్ ఎలిమినేషన్ ముప్పు

ప్రస్తుతం హౌస్‌లో 17 మంది సభ్యులు ఉన్నారు. గ్రాండ్ ఫినాలే నాటికి టాప్ 5 సభ్యులను ఉంచాలంటే రాబోయే వారాల్లో కచ్చితంగా డబుల్ ఎలిమినేషన్లు జరగాల్సిందే. ఈ వారం 12 మంది నామినేషన్లలో ఉన్నందున ఇద్దరిని ఎలిమినేట్ చేసే ప్లాన్‌లో బిగ్ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓటింగ్ లీస్ట్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన నీతూ మాస్టర్, దక్షి గుత్తికొండ అతి తక్కువ ఓట్లతో ఆఖరి స్థానాల్లో ఉన్నారు. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున వీరిద్దరినీ హౌస్ నుంచి సాగనంపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.