Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ.. ముఖేష్‌ను వరించిన కెప్టెన్సీ, అపూర్వకు అరుదైన అవకాశం
Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు హౌస్‌లో 19వ రోజు ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా, రసాభాసగా సాగింది.
Bigg Boss 10 Mukesh
Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు హౌస్‌లో 19వ రోజు ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా, రసాభాసగా సాగింది. హౌస్మేట్స్ ఎవరైతే వద్దని భావించి తక్కువ ఓట్లు వేశారో, అదే అపూర్వను బిగ్ బాస్ అనూహ్యంగా హౌస్‌లోకి తీసుకువచ్చారు. అందరికీ టెన్షన్ ఇవ్వడానికే ఆమెను పంపినట్లు బిగ్ బాస్ స్పష్టం చేశారు. అపూర్వ రాగానే రోహిత్‌తో కలిసి డ్యాన్స్ చేయడం, సెలెబ్రిటీ గ్యాంగ్‌తో కలిసి తిరగడం వంటి పరిణామాలు జరిగాయి. అయితే అపూర్వ ఎంట్రీతో షాలిని, రోహిత్ మధ్య కొంత గందరగోళం ఏర్పడింది. అపూర్వ రాక ఇష్టం లేదంటూ గతంలో మాట్లాడిన ముఖేష్, ఇప్పుడు ఆమెతో కలిసి ఉండటంపై హౌస్‌లో చర్చ మొదలైంది. మరోవైపు టైర్ల టాస్క్‌లో గెలిచి మిథిలేష్ కూడా హౌస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
అమన్ - త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం
ఇంటి పనుల విషయమై త్రిగుణ్, అమన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కెప్టెన్ చెప్తేనే వింటానని, నువ్వు చెప్తే ఎందుకు వినాలంటూ అమన్ అనడంతో గొడవ పెద్దదైంది. నా ముందు రుబాబ్ చూపించకు అంటూ త్రిగుణ్ ఫైర్ అయ్యాడు. అయితే కొద్దిసేపటి తర్వాత తేరుకున్న త్రిగుణ్, తాను ఏదో టెన్షన్లో అలా అన్నానని అమన్‌కు సారీ చెప్పి వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాడు. మరోవైపు నరేష్ నిద్రపోతుండటంతో బిగ్ బాస్ హెచ్చరించగా, ఝాన్సీ అతనికి గుంజీలు తీయిస్తూ పనిష్మెంట్ ఇవ్వడం గమనార్హం. అలాగే ఎగ్స్ విషయంలో రోహిత్, అపూర్వ మధ్య మాటల యుద్ధం జరిగి హౌస్‌లో హీట్ పెంచింది.
అపూర్వ, మిథిలేష్‌లకు బిగ్ బాస్ స్పెషల్ పవర్
హౌస్‌లోకి అడుగుపెట్టిన అపూర్వ, మిథిలేష్‌లకు బిగ్ బాస్ ఒక కీలకమైన పవర్ ఇస్తారు. కెప్టెన్సీ కంటెండర్ల నుంచి ఇద్దరిని తొలగించే అవకాశాన్ని వారికి కల్పిస్తారు. దీనిపై స్పందించిన అపూర్వ, మిథిలేష్.. శ్రిష్టి, ఝాన్సీ పేర్లను సూచిస్తారు. శ్రిష్టికి సహనం లేదని, సుధీర్‌తో గొడవ పడినప్పుడు ఆమె వ్యవహరించిన తీరు సరిగా లేదని వారు కారణాలు చెప్పారు. ఈ నిర్ణయంపై రోహిత్ అభ్యంతరం చెప్పడంతో, హౌస్మేట్స్ అందరి మధ్య పెద్ద వాదన నడిచింది. అగ్ని పరీక్ష సమయంలోనూ అపూర్వ సరిగా సంచాలక్ గా వ్యవహరించలేదంటూ అమన్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు.
ముఖేష్‌కు కెప్టెన్సీ, అపూర్వకు ఇమ్యూనిటీ
ఈ ఎపిసోడ్లో బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఒక సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ముఖేష్, అపూర్వ ఒక టీంగా.. ఝాన్సీ, మిథిలేష్ మరో టీంగా హోరాహోరీగా తలపడ్డారు. ఈ ఉత్కంఠభరితమైన టాస్క్‌లో ముఖేష్, అపూర్వ జోడీ ఘన విజయం సాధించింది. దీంతో బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఒకే టాస్క్‌లో గెలిచిన ముఖేష్‌కు ఇంటి కెప్టెన్ బాధ్యతలు దక్కగా, ఆయనతో పాటు ఆడిన అపూర్వకు ఏకంగా ఇమ్యూనిటీ లభించింది. ఇలా ఒకే టాస్క్‌లో ఇద్దరికీ వేర్వేరు భారీ బెనిఫిట్స్ రావడంతో హౌస్‌లో అందరూ ఆశ్చర్యపోయారు. గెలిచిన తర్వాత ముఖేష్ తనదైన శైలిలో ప్రత్యర్థులకు కౌంటర్లు ఇస్తూ సంబరాలు చేసుకున్నారు.




