Bigg Boss 10: డామినేషన్ టాస్క్‌లో రచ్చ రచ్చ..శ్రిష్టి, ముఖేష్‌లకు గాయాలు.. అపూర్వ వర్సెస్ షాలినీ ఫైట్

Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 నాలుగో వారంలో ఆట రసవత్తరంగా మారుతోంది.

CR Reddy
Published on: 29 Sept 2026 7:48 AM IST
Bigg Boss 10
X

Bigg Boss 10

Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 నాలుగో వారంలో ఆట రసవత్తరంగా మారుతోంది. ఈ వారం మొత్తం టోటల్ డామినేషన్ థీమ్‌తో సాగుతుండటంతో ఇంటి సభ్యుల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. సోమవారం ప్రసారమైన 23వ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య జరిగిన గొడవలు, అరుపులతో హౌస్ దద్దరిల్లిపోయింది. ఆటలో భాగంగా జరిగిన తీవ్రమైన పరిణామాల కారణంగా శ్రిష్టి అలాగే ముఖేష్ కాలికి గాయాలు కావడం అందరినీ కలవరపెట్టింది. ఆటలో ఆధిపత్యం చెలాయించేందుకు సభ్యులు ఏకంగా శారీరక ఘర్షణలకు దిగడం ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది.

అపూర్వ, ముఖేష్ మధ్య కెప్టెన్సీ వివాదం

ఇంటి కెప్టెన్ అయిన అపూర్వకు, ముఖేష్‌కు మధ్య డిష్ వాషింగ్, కెప్టెన్ రూమ్ ఖాళీ చేసే అంశాలపై తీవ్ర వాగ్వాదం జరిగింది. అందరి సమక్షంలో మీటింగ్ పెట్టి రూల్స్ చెబితేనే ఫాలో అవుతామని ముఖేష్ వాదించారు. కెప్టెన్‌ను అగౌరవ పరుస్తున్నారంటూ అపూర్వ మండిపడ్డారు. అందరూ తనను కెప్టెన్ అపూర్వ అని గౌరవంగా పిలవాలని ఆమె కొత్త నిబంధన పెట్టగా, త్రిగుణ్ మాత్రం తాను పిలవనంటూ తేల్చిచెప్పడం ఇంట్లో పెద్ద దుమారానికి దారితీసింది.

టోటల్ డామినేషన్ టాస్క్, కత్తుల వేట

బిగ్‌బాస్ ప్రవేశపెట్టిన కొత్త టాస్క్‌లో ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విభజించారు. షాలినీ, శ్రిష్టి, చరణ్, నరేష్, త్రిగుణ్, ముఖేష్, దేబ్జానీ ఒక టీమ్‌గా (సప్తశక్తి) ఉండగా, మిగిలిన వారంతా మరో టీమ్‌గా (భైరవ) ఏర్పడ్డారు. మొదటి ఆయుధంగా అందరికీ డ్యాగర్స్ (కత్తులు) కేటాయించారు. ప్రత్యర్థుల వద్ద ఉన్న కత్తులను లాక్కునే క్రమంలో రోహిత్, సుధీర్, రాంప్రసాద్‌లు నరేష్‌ను ఎత్తుకెళ్లి కత్తిని లాక్కోవడంతో వివాదం మొదలైంది. ఈ చిన్న గొడవ కాస్తా పెద్ద ఘర్షణగా మారి ఇరు వర్గాల మధ్య తీవ్ర వాదనలకు దారితీసింది.

శ్రిష్టి, ముఖేష్‌లకు గాయాలు

రథం నిర్మాణానికి సంబంధించిన బ్రిక్స్ కలెక్ట్ చేసే టాస్క్ హోరాహోరీగా సాగింది. ఈ ఆట మధ్యలో జరిగిన తోపులాటలో శ్రిష్టి కాలికి బలమైన గాయమైంది. ఆమెను మెడికల్ రూమ్‌కు తరలించే సమయంలో ఆమె వద్ద ఉన్న కత్తిని షాలినీ తీసుకోవడం వివాదానికి కారణమైంది. మెడికల్ రూమ్‌కు వెళ్తున్న సమయంలో ప్రత్యర్థి టీమ్ సభ్యులు కత్తిని లాక్కోవడం తప్పని అపూర్వ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ఆటలో ముఖేష్ కాలికి కూడా గాయం కావడంతో కంటెస్టెంట్లు ఆందోళన చెందారు.

త్రిగుణ్, రోహిత్ మధ్య మాటల యుద్ధం

ఆట సమయంలో ఇరు జట్ల సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. త్రిగుణ్, రోహిత్ మధ్య జరిగిన వాగ్వాదం శ్రుతిమించింది. ఒకరినొకరు కించపరుచుకుంటూ తీవ్రమైన మాటలు విసురుకున్నారు. అమన్ ఆడిన ఫౌల్ గేమ్ గురించి షాలినీ ప్రశ్నించడంతో అమన్, షాలినీ మధ్య కూడా పెద్ద యుద్ధమే జరిగింది. ఆట నియమాలను ఉల్లంఘిస్తున్నారంటూ రెండు జట్లు పరస్పరం గొడవ పడ్డాయి.

రెడ్ టీమ్ విజయం, రాబోయే నామినేషన్స్

ఇన్ని ఉద్రిక్తతలు, గాయాలు, వాదనల మధ్య జరిగిన ఈ హోరాహోరీ టాస్క్‌లో చివరకు రెడ్ టీమ్ (భైరవ) విజయం సాధించింది. రథానికి సంబంధించిన మొదటి భాగాన్ని రెడ్ టీమ్ విజయవంతంగా అమర్చుకుంది. మొదటి రోజు జరిగిన ఈ పరిణామాలు చూస్తుంటే ఈ వారం ఆట మరింత ఉత్కంఠభరితంగా సాగనుందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా రాబోయే ఎపిసోడ్‌లో జరగనున్న నామినేషన్ల ప్రక్రియపై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.