Bigg Boss 10: షాలినికి నాగ్ సీరియస్ వార్నింగ్.. వర్షిణి పవర్ కట్.. రోహిత్‌కు గట్టి క్లాస్
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారం శనివారం నాటి వీకెండ్ ఎపిసోడ్ అత్యంత రసవత్తరంగా సాగింది.
Bigg Boss 10
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారం శనివారం నాటి వీకెండ్ ఎపిసోడ్ అత్యంత రసవత్తరంగా సాగింది. హోస్ట్ అక్కినేని నాగార్జున హౌస్‌మేట్స్‌కు గట్టిగా క్లాస్ పీకడంతో పాటు వారి తప్పులను నిలదీశారు. ఎపిసోడ్ ప్రారంభంలోనే హౌస్‌లో 15 మంది ఉన్నప్పటికీ కేవలం 13 మందే కనిపిస్తున్నారని నాగ్ షాకింగ్ కామెంట్ చేశారు. ఆటలో ఎలాంటి చురుకుదనం చూపించకుండా ప్రేక్షకుల్లా కూర్చున్న సృష్టి, కృష్ణుడులను అందరికీ దూరంగా స్టోర్‌రూమ్‌కు పంపించి మూలలో కూర్చోబెట్టి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశారు. కంటెస్టెంట్లు అందరూ యాక్టివ్‌గా ఉండాలని, లేదంటే ఇలాంటి శిక్షలే ఉంటాయని హెచ్చరించారు.
ఇక ఈ వారం గేమ్‌లలో సరిగా వ్యవహరించని సంచాలక్ వర్షిణి తీరుపై నాగార్జున తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖేష్‌కు ఫేవర్‌గా నిర్ణయాలు తీసుకుందని, వంశీ చెప్పిన సరైన పాయింట్లను పట్టించుకోలేదని తప్పుబట్టారు. ప్రేక్షకులు కూడా వర్షిణి తీరుకు వ్యతిరేకంగా ఉండటంతో, ఈ సీజన్ పూర్తయ్యే వరకు ఆమెను ఎప్పటికీ సంచాలక్‌గా నియమించబోమని బిగ్ బాస్ ద్వారా పెద్ద శిక్ష విధించారు. అలాగే టాస్క్ సమయంలో షాలిని ప్రవర్తనను కూడా నాగ్ గట్టిగా ఖండించారు. ఎదుటివారిపైకి మీద మీదకు వెళ్లడం తప్పు అని, యాంగర్ మేనేజ్మెంట్ అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. నాగ్ క్లాస్ పీకడంతో షాలిని కంటతడి పెట్టుకుంది.
ఫిజికల్ టాస్కుల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న రోహిత్‌కు కూడా నాగ్ తగిన సలహాలు ఇచ్చారు. “నీ పేరులోనే హిట్ ఉంది, ఆట బాగుంది కానీ తీరు మార్చుకో, కోపంతో రెచ్చిపోయేవాడు ఎప్పటికీ గెలవలేడు” అని స్పష్టం చేశారు. అలాగే కిచెన్‌లో అరుస్తూ వంట చేయకూడదని వంశీకి చురకలు అటించారు. ఇంట్లో పగటిపూట ఎవరూ బెడ్రూమ్లోకి వెళ్లకూడదని కొత్త రూల్ పెట్టారు. రాంప్రసాద్‌కు నిద్రపోయే సమయంలో కుక్కలు అరిచే సౌండ్ వినిపించి సరిగ్గా రూల్స్ పాటించకపోతే జరిగే పరిణామాలను గుర్తుచేశారు. ఈ వారం నామినేషన్లో ఉన్న వారిలో ముఖేష్, దేబ్జానీ, రాంప్రసాద్, ఝాన్సీ, షాలినిలు డేంజర్ జోన్ నుంచి సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో ఈ ఉత్కంఠభరిత ఎపిసోడ్ ముగిసింది.




