Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ 10లోకి ఆ ఇద్దరు.. జబర్దస్త్ ప్రోమోతో పెరిగిన సస్పెన్స్..
Bigg Boss 10 Telugu: తెలుగు బుల్లితెరపై సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన ల్యాండ్‌మార్క్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు 10’..
bigboss-10
Bigg Boss Telugu 10 : తెలుగు బుల్లితెరపై సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన ల్యాండ్‌మార్క్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు 10’ (Bigg Boss Telugu Season 10) ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఎవర్ గ్రీన్ కింగ్ నాగార్జున ఈ పదో సీజన్‌కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటంతో అటు అభిమానుల్లోనూ, ఇటు బుల్లితెర వీక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ గ్రాండ్ షో చాలా అంగరంగ వైభవంగా ప్రారంభం కానుందనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ కోసం బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరనే దానిపై సోషల్ మీడియా వేదికగా నిత్యం అనేక రకాల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.
జబర్దస్త్ తాజా ప్రోమోతో పెరిగిన సస్పెన్స్
ఇదిలా ఉంటే, ప్రముఖ కామెడీ షో 'జబర్దస్త్' విడుదల చేసిన తాజా ప్రోమో ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 10 కంటెస్టెంట్ల ఊహాగానాలకు మరింత బల చేకూర్చింది. బుల్లితెర వీక్షకులను ఎన్నో ఏళ్లుగా నవ్విస్తున్న పాపులర్ కమెడియన్లు ఆటో రామ్ ప్రసాద్ , పొట్టి నరేష్ ఈ కొత్త ప్రోమోలో ఎక్కడా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ప్రతివారం ఎపిసోడ్‌లలో తమదైన పంచులతో సందడి చేసే ఈ ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులు హఠాత్తుగా ప్రోమో నుంచి గాయబ్ కావడంతో, వీరిద్దరూ బిగ్‌బాస్ 10 పోటీదారులుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికే సిద్ధమవుతున్నారనే ప్రచారం సినీ, బుల్లితెర వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
షూటింగ్‌లకు విరామం.. బిగ్‌బాస్ రూల్స్ కారణమా?
సాధారణంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే సెలబ్రిటీలు షో ప్రారంభానికి కొన్ని రోజుల ముందే క్వారంటైన్ లేదా ప్రీ-ప్రొడక్షన్ ఏర్పాట్ల నిమిత్తం బయటి ప్రపంచానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా తమ ప్రస్తుత ప్రాజెక్టుల షూటింగ్‌ల నుంచి కూడా తాత్కాలికంగా విరామం తీసుకుంటారు. ఈ నిబంధనల కారణం గానే ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేష్ కూడా జబర్దస్త్ షూటింగ్‌లకు దూరమైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ క్రేజీ రూమర్లపై బిగ్‌బాస్ నిర్వాహకులు గానీ, లేదా సంబంధిత కమెడియన్లు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.
హౌస్‌లో కామెడీ డోస్ పెంచేందుకు పక్కా ప్లాన్
బిగ్‌బాస్ షోలో కేవలం కఠినమైన టాస్క్‌లు, నామినేషన్ గొడవలు , తీవ్రమైన ఎమోషన్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులను ప్రతిరోజూ కట్టిపడేసేందుకు కామెడీ కూడా చాలా ముఖ్యం. గత సీజన్లలో జబర్దస్త్ నుంచి వచ్చిన ముక్కు అవినాష్, రోహిణి, ఇమ్మాన్యుయేల్, ఫైమా వంటి నటులు తమదైన స్వచ్ఛమైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో హౌస్‌లో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా షో రేటింగ్‌ను పెంచడంలో కూడా కీలక పాత్ర పోషించారు.
ఇప్పుడు ఈ 10వ సీజన్ అత్యంత ప్రాధాన్యత కలిగిన మైలురాయి కావడం వల్ల హౌస్‌లో వినోదానికి ఎలాంటి లోటు లేకుండా చూసేందుకు బిగ్‌బాస్ బృందం మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మంచి కామెడీ టైమింగ్, సెటైరికల్ పంచులతో ఆకట్టుకునే ఆటో రామ్ ప్రసాద్, అలాగే తనదైన శైలిలో నవ్వించే పొట్టి నరేష్‌లను బరిలోకి దించితే షో గ్యారంటీగా హిట్ అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా రామ్ ప్రసాద్ మార్క్ రైటింగ్ , కామెడీ సెన్స్ హౌస్‌లోని సీరియస్ వాతావరణాన్ని మార్చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.




