Bigg Boss 10: ఫేస్ లుక్స్ పై సెటైర్లు.. నామినేషన్ పేరుతో పగలు తీర్చుకున్న కంటెస్టెంట్లు
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లో 29వ రోజు నామినేషన్ల ప్రక్రియ తీవ్ర రసాభాసగా మారింది. అపూర్వ, ముకేశ్ మధ్య పర్సనల్ కామెంట్స్‌తో మాటల యుద్ధం జరిగింది.
Bigg Boss Telugu 10
Bigg Boss 10: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రస్తుతం ఐదో వారంలోకి అడుగుపెట్టి ఉత్కంఠగా సాగుతోంది. 29వ రోజు జరిగిన నామినేషన్ల ప్రక్రియ హౌస్‌ను ఒక్కసారిగా హీటెక్కించింది. సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటూ గొడవలకు దిగారు. ముఖ్యంగా కంటెస్టెంట్లు అపూర్వ, ముకేశ్ మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం శృతిమించడంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు.
ఆపిల్ టాస్క్.. రామ్ ప్రసాద్ స్ట్రాటజీ!
ఈ వారపు నామినేషన్లలో బిగ్ బాస్ ఒక ఆసక్తికరమైన ఆపిల్ టాస్క్ ఇచ్చారు. బాక్స్ కింద దాచిన ఆపిల్‌ను ముందుగా దక్కించుకున్న వారికి ఇద్దరిని నామినేట్ చేసే ప్రత్యేక అధికారం లభిస్తుంది. ఆపిల్ దక్కని వారు ఒకరిని మాత్రమే నామినేట్ చేయాల్సి ఉంటుంది. మొదటి రౌండ్‌లో ముకేశ్‌ను దాటుకుని రామ్ ప్రసాద్ ఆపిల్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో రామ్ ప్రసాద్ వెంటనే త్రిగుణ్, అమన్ లను నామినేట్ చేస్తూ, త్రిగుణ్ గేమ్‌లో అతిగా అగ్రెసివ్ అవుతున్నారని తన అభిప్రాయాన్ని చెప్పారు.
అపూర్వ, ముకేశ్ మధ్య పర్సనల్ కామెంట్స్ వార్
ఆపిల్ దక్కించుకోలేకపోయిన ముకేశ్, అపూర్వను నామినేట్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం హద్దులు దాటింది. అపూర్వ వర్స్ట్ కెప్టెన్ అని, ఆమె పక్షపాతంతో వ్యవహరించిందని ముకేశ్ విమర్శించారు. దీనికి అపూర్వ ఘాటుగా స్పందిస్తూ ముకేశ్ కెప్టెన్ అయితే వర్షిణి వెనుక ఉండి నడిపించిందని కౌంటర్ ఇచ్చారు. దీనితో వర్షిణి కూడా గొడవలోకి దిగింది. ముకేశ్ తన వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ 'దాన్ని మైంటైన్ చేస్తున్నావా', 'ట్రయాంగిల్ లవ్ స్టోరీనా' అంటూ రోహిత్ పేరు తీసి మాట్లాడారని అపూర్వ నిప్పులు చెరిగారు.
లుక్స్ పై సెటైర్లు.. త్రిగుణ్ నామినేషన్!
ఆ తదుపరి రౌండ్‌లో త్రిగుణ్ ఆపిల్ దక్కించుకుని అపూర్వను నామినేట్ చేశారు. గతంలో అపూర్వ తన లుక్స్ గురించి మాట్లాడిందని, అందుకే తాను కూడా ఆమె లుక్స్ గురించి మాట్లాడే వెసులుబాటు తనకు దక్కిందని సెటైరికల్ కామెంట్స్ చేస్తూ నామినేట్ చేశారు. నామినేషన్ ప్రక్రియ అంతా వ్యక్తిగత దూషణలతో తీవ్ర ఉద్రిక్తత నడుమ సాగింది.
ఐదో వారం డేంజర్ జోన్‌లో ఉన్నది వీళ్లే
రసవత్తరంగా సాగిన ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి మొత్తం ఏడుగురు సభ్యులు ఈ వారం ఎలిమినేషన్ బరిలో నిలిచారు. త్రిగుణ్, అమన్, అపూర్వ, రోహిత్, చరణ్, షాలిని నామినేషన్లలో ఉన్నారు. వీరిలో చరణ్, షాలిని ప్రదర్శనపై ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నందున వారు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వారాంతంలో హోస్ట్ నాగార్జున ఎవరికి క్లాస్ పీకుతారో, ఎవరు హౌస్ వీడుతారో చూడాలి.




