Bigg Boss 10: బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. కేవలం నాలుగు రోజుల్లోనే ఇద్దరు కంటెస్టెంట్లు ఔట్
Bigg Boss 10: గురువారం ఎపిసోడ్‌లో చరణ్ ఎలిమినేషన్ షాక్ నుంచి ప్రేక్షకులు కోలుకోకమునే, శుక్రవారం నాటి ఐదవ రోజు ఎపిసోడ్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది.
Bigg Boss 10
Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. గురువారం ఎపిసోడ్‌లో చరణ్ ఎలిమినేషన్ షాక్ నుంచి ప్రేక్షకులు కోలుకోకమునే, శుక్రవారం నాటి ఐదవ రోజు ఎపిసోడ్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది. నటి చైత్ర రాయ్ ఊహించని రీతిలో హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవడంతో కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
తప్పులో కాలేసిన కంటెస్టెంట్లు
గత ఎపిసోడ్‌లో చరణ్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాత్రి సమయంలో అమన్, రోహిత్, సృష్టి, షాలిని కలిసి ఝాన్సీ గేమ్ ప్లాన్ గురించి చర్చిస్తారు. మిగతా వాళ్ల టార్గెట్ నుంచి తప్పించుకోవడానికి ఝాన్సీ వ్యూహాత్మకంగా వేరే గ్రూప్‌లోకి వెళ్లిందని విశ్లేషించుకుంటారు. మరోవైపు రోహిత్ వ్యవహారశైలిపై తోటి సభ్యుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు చెలరేగుతాయి. సృష్టి రోహిత్ తనతో సరిగ్గా మాట్లాడటం లేదని అమన్‌తో వాపోవడం, అమన్ రోహిత్ కు చెప్పడంతో తర్వాత రోహిత్ జోక్యం చేసుకుని సృష్టికి సర్దిచెప్పడం వంటి డ్రామాలు నడిచాయి. షాలిని తన వల్లే రోహిత్ సృష్టికి దూరం అయిపోతున్నాడని ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రోహిత్ వెళ్లి షాలినితో మాట్లాడుతాడు.
రన్ రాజా రన్ గేమ్‌లో రాంప్రసాద్ విజయం
ఐదవ రోజు బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఈజీ టాస్క్, హార్డ్ టాస్క్ అనే రెండు రకాల సవాళ్లను విసిరారు. సింపుల్ టాస్క్‌గా భావించిన 'రన్ రాజా రన్' ఆటలో త్రిగుణ్ సంచాలకుడిగా వ్యవహరించాడు. ఈ ఉత్కంఠభరితమైన పరుగు పందెం పోటీలో చివరి వరకు హోరాహోరీగా పోరాడిన రాంప్రసాద్ విజయం సాధించి పర్మినెంట్ హౌస్‌మేట్‌గా అర్హత సాధించాడు. ఆ తర్వాత రాంప్రసాద్‌ను ఒకరిని హై రిస్క్ జోన్‌లో పెట్టమని బిగ్‌బాస్ సూచించగా, అతను అమన్‌ను ఎంచుకుంటాడు.
వర్షిణి, సుధీర్ అట్టర్ ఫ్లాప్ డ్రామా
మరోవైపు హార్డ్ టాస్క్‌ను ఎంచుకున్న సుధీర్, వర్షిణిలకు బిగ్‌బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తారు. కేక్‌ను పాడు చేసి ఆ నెపాన్ని ఒకరిపై ఒకరు వేసుకుంటూ తోటి సభ్యులను నమ్మించాలని ఆదేశిస్తారు. కానీ ఈ ఇద్దరూ ఓవరాక్షన్ చేస్తూ సహచరుల ముందు దొరికిపోవడంతో సీక్రెట్ టాస్క్ బెడిసికొట్టింది. ఎవరూ వీరి మాటలను నమ్మకపోవడంతో పాటు తాము పర్మినెంట్ అయ్యామని అతిగా బిల్డప్ ఇవ్వడంతో బిగ్‌బాస్ వీరిద్దరినీ ఫెయిల్ అయినట్లు ప్రకటించి నేరుగా హై రిస్క్ జోన్‌లోకి పంపేశారు.
చైత్ర రాయ్ ఊహించని ఎలిమినేషన్
టాస్క్‌ల పరంపర ముగిసిన వెంటనే బిగ్‌బాస్ మరో పెద్ద బాంబ్ పేల్చారు. ప్రస్తుతం హై రిస్క్ జోన్‌లో ఉన్న చైత్ర, వర్షిణి, సుధీర్, అమన్‌లలో ఒకరు వెంటనే హౌస్ వీడాలని ప్రకటించారు. ఇంటి సభ్యుల అభిప్రాయం మేరకు ఎక్కువ మంది చైత్ర పేరును సూచించారు. దీంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. గత సీజన్ల మాదిరిగానే యమ భటుల గెటప్‌లో వచ్చిన దూతలు ఆమెను శవపేటిక లాంటి ప్రత్యేక సెటప్‌లో ఉంచి బయటికి తీసుకెళ్లారు. కేవలం నాలుగు రోజుల్లోనే ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవడం చూసి రాంప్రసాద్ ఆశ్చర్యపోతాడు. దీంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.




