Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10 వచ్చేస్తోంది.. అదిరిపోయే ప్రోమోతో కింగ్ నాగార్జున ఎంట్రీ!

Bigg Boss Telugu 10: బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్ సీజన్ 10 సిద్ధమైంది. హోస్ట్ నాగార్జున సరికొత్త పవర్‌ఫుల్ ప్రోమోతో ఈ గుడ్‌న్యూస్ పంచుకున్నారు.

Arun Chilukuri
Published on: 7 Jun 2026 11:27 AM IST
Bigg Boss Telugu 10
X

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10 వచ్చేస్తోంది.. అదిరిపోయే ప్రోమోతో కింగ్ నాగార్జున ఎంట్రీ!

Bigg Boss Telugu 10: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరించిన పాపులర్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ (Bigg Boss) సరికొత్త మైలురాయిని అందుకోబోతోంది. ఇప్పటికే విజయవంతంగా 9 సీజన్లను పూర్తి చేసుకుని ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని పంచిన ఈ కార్యక్రమం.. ఇప్పుడు 10వ సీజన్‌తో (Bigg Boss Telugu 10) మన ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, స్టార్ హోస్ట్‌ అక్కినేని నాగార్జున బిగ్‌బాస్ ప్రియులకు ఒక క్రేజీ గుడ్‌న్యూస్‌ చెబుతూ స్పెషల్‌ వీడియోను పంచుకున్నారు.

‘‘బిగ్‌బాస్‌.. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం’’ అంటూ నాగార్జున చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ తాజా వీడియో సోషల్ మీడియాలో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేసిన పాట వీడియోకు హైలైట్‌గా నిలిచింది. ‘ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో కొత్త సీజన్‌ ఎంత రసవత్తరంగా, సవాలుతో కూడుకుని ఉండబోతోందో మేకర్స్ హింట్‌ ఇచ్చారు.

గత సీజన్ (బిగ్‌బాస్ 9)లో సెలబ్రిటీలతోపాటు సామాన్యులకూ బిగ్‌బాస్ టీమ్ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఎన్నో వడపోతలు, అగ్ని పరీక్షలను దాటుకుని ఆరుగురు సామాన్యులు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టి సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇచ్చారు. అంతేకాదు, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కామన్‌మ్యాన్ కేటగిరీలో వచ్చిన కల్యాణ్‌ పడాల ‘బిగ్‌బాస్‌ 9’ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు.

దీంతో ఇప్పుడు రాబోయే 10వ సీజన్‌లో కూడా సామాన్యులకు ఛాన్స్‌ ఇస్తారా? లేక కేవలం ప్రముఖులకే ఎంట్రీ ఉంటుందా? అసలు ఈసారి కంటెస్టెంట్‌లు ఎవరు? షో ఎప్పుడు గ్రాండ్‌గా ప్రారంభమవుతుంది? అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి. వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story