Bigg Boss 10: 12వ వారం నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. వర్షిణి మొహాన కాఫీ కొట్టిన సుధీర్
బిగ్ బాస్ తెలుగు 10 12వ వారం నామినేషన్స్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వర్షిణిపై సుధీర్, రాం ప్రసాద్‌పై దేబ్జానీ నామినేషన్ బాంబులు వేశారు.
Bigg Boss Telugu 10
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తుది దశకు చేరుకోవడంతో హౌస్‌లో వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంకా నాలుగు వారాలే మిగిలి ఉండటంతో ఇకపై గ్రూపులు ఉండవని, ఎవరి ఆట వాళ్లు ఆడుకోవాలని హోస్ట్ నాగార్జున తేల్చి చెప్పేశారు. దాంతో 12వ వారం నామినేషన్స్‌లోనే కంటెస్టెంట్ల మధ్య ఆ మార్పు స్పష్టంగా కనిపించింది. ఎప్పటిలాగే శివ్ మరోసారి త్రిగుణ్‌ను నామినేట్ చేస్తూ ఫైర్ అయ్యాడు. బయట త్రిగుణ్‌కు ఉన్న క్రేజ్ చూసే స్క్రీన్ స్పేస్ కోసం శివ్ ఇలా చేస్తున్నాడన్న చర్చ జరుగుతోంది. మరోవైపు డిక్టేటర్ టాస్క్‌లో ఫ్లాప్ అయిన ముకేశ్‌ను నరేశ్, రాం ప్రసాద్ లాంటి వాళ్లు టార్గెట్ చేశారు.
సుధీర్-వర్షిణి మధ్య మాటల యుద్ధం
78వ రోజు ప్రోమోలో సుధీర్, వర్షిణి మధ్య జరిగిన గొడవ హైలైట్‌గా నిలిచింది. రివార్డ్ రివెంజ్ టాస్కులో వర్షిణి వ్యవహరించిన తీరుపై సుధీర్ పాయింట్లు ఎత్తి నామినేట్ చేశాడు. నువ్వు నీ కోసం కాకుండా పక్కవాళ్ల కోసం ఆడుతున్నావని సుధీర్ ఆరోపించాడు. దీనికి వర్షిణి "నన్ను చూడు.. నాతో మాట్లాడు" అంటూ గట్టిగా సమాధానమిచ్చింది. అప్పుడు సంచాలక్‌గా రోహిత్ ఉన్నప్పుడు సాయం చేస్తే తప్పు లేదు కదా అని ఎదురుదాడి చేసింది. రాం ప్రసాద్ సైతం నువ్వు ముకేశ్‌కు సపోర్ట్ చేయడానికే ఆడావని విమర్శించాడు. చివరికి "నువ్వు తప్పు చేశావా లేదా చెప్పు" అని సుధీర్ నిలదీయగా, "నీకు ఎందుకు చెప్పాలి బై" అని వర్షిణి అనడంతో సుధీర్ కాఫీని వర్షిణి మొహాన కొట్టి నామినేట్ చేశాడు.
రాం ప్రసాద్‌కు దేబ్జానీ షాక్
ఇక హౌస్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన మరో నామినేషన్ దేబ్జానీది. తనతో మంచి బాండ్ ఉన్న రాం ప్రసాద్‌నే దేబ్జానీ నామినేట్ చేసి షాక్ ఇచ్చింది. "ఆర్గానిక్ బాండ్ అంటారు కదా.. నాకు కెప్టెన్సీ ఎంత ముఖ్యమో తెలిసినా నువ్వు ఆ రోజు సపోర్ట్ చేయలేదు" అంటూ ఆమె కారణం చెప్పింది. దీనిపై రాం ప్రసాద్ బాధపడుతూ "నాకు పవర్ ఇస్తే నిన్నే కెప్టెన్ చేసేవాడిని, అంత ప్రేమ ఉన్నా నువ్వు చాలా స్వార్థంగా వ్యవహరిస్తున్నావు" అని అన్నాడు. మరోవైపు ఈ నామినేషన్ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న కెప్టెన్ అమన్‌ను దేబ్జానీ పక్కకు పో అనడంతో అమన్ కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
ముకేశ్‌పై త్రిగుణ్, దేబ్జానీ ఫైర్
నామినేషన్స్ గొడవలు ఒకవైపు జరుగుతుంటే, ముకేశ్ చేసిన పని హౌస్‌లో మరో అగ్గి రాజేసింది. కెప్టెన్ అమన్ ఆదేశాల మేరకంటూ బాత్రూం ఏరియాలో ఆరేసిన వర్షిణి, దేబ్జానీ, శివ్, త్రిగుణ్ బట్టలన్నింటినీ ముకేశ్ తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్‌లో పడేశాడు. ఉదయమే ఉతికిన ఉలెన్ బట్టలు ఇంకా ఆరలేదని, ఒక రోజు కూడా కాకముందే ఇలా పగ సాధించినట్లు ఎందుకు పడేశావంటూ దేబ్జానీ, త్రిగుణ్, వర్షిణి అతనిపై విరుచుకుపడ్డారు.
ముకేశ్ పై కంటెస్టెంట్ల ఆగ్రహం
బట్టల విషయంలో ముకేశ్ ఏమాత్రం తగ్గకుండా కెప్టెన్ చెప్పాడని వాదించడంతో గొడవ మరింత ముదిరింది. ఇది కచ్చితంగా కంటెస్టెంట్లను రెచ్చగొట్టేందుకు ముకేశ్ కావాలని చేస్తున్న పని అని సుధీర్ వ్యాఖ్యానించాడు. నామినేషన్స్ మధ్యలో ఇలాంటి ఈగో చూపించడం సరికాదని, పగ తీర్చుకోవడానికి వచ్చాడా అంటూ త్రిగుణ్ మండిపడ్డాడు. నామినేషన్స్ లేవు, కంటెంట్ లేదు కాబట్టే ఇలా చేస్తున్నాడంటూ ముకేశ్‌ను బయటకు పంపించేయాలని బిగ్ బాస్‌ను కోరుతూ దేబ్జానీ కన్నీళ్లు పెట్టుకుంది.




