Bigg Boss Telugu 10: నేడే తెలుగు బిగ్ బాస్ పదో సీజన్ ..టైమింగ్స్‌లో భారీ మార్పులు!
Bigg Boss Telugu 10: ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఈరోజే ప్రారంభం కానుంది.
Bigg Boss Telugu 10: నేడే తెలుగు బిగ్ బాస్ పదో సీజన్ ..టైమింగ్స్‌లో భారీ మార్పులు!
Bigg Boss Telugu 10: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తన 10వ సీజన్‌ను అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. దశావతారం అనే వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు, అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సెప్టెంబర్ 06 అంటే ఆదివారం రాత్రి 7:00 గంటలకు షో ప్రారంభం కానుంది. సోమవారం నుంచి - శుక్రవారం రాత్రి 9:30 గంటల వరకు ఈ రియాల్టీ షో ప్రసారం కానుంది. ఇక వీకెండ్ స్పెషల్ ఎపిసోడ్లు అంటే శని, ఆదివారాలు రాత్రి 9:00 గంటలకు షో మొదలు కానుంది.
గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ రాత్రి 10:00 గంటలకు ప్రసారం కావడం వల్ల ఉద్యోగులు, ఫ్యామిలీ ఆడియన్స్ రాత్రి ఆలస్యమై ఇబ్బంది పడేవారు. అయితే, ఈ 10వ సీజన్ కోసం తిరిగి రాత్రి 9:30 గంటల ప్రైమ్ టైమ్ను కేటాయించడంతో ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2017లో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్, 2018లో నాని హోస్ట్ చేసిన రెండో సీజన్ రాత్రి 9:30 గంటలకే టెలికాస్ట్ అయి సంచలన టీఆర్‌పీ రికార్డులను సృష్టించాయి. ఇప్పుడు మళ్లీ అదే సమయానికి షో ముందుకు రావడంతో ఈ సీజన్ టీఆర్‌పీ రేటింగ్స్ భారీగా పుంజుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
వరుసగా ఎనిమిదోసారి బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున ఈ పదో సీజన్‌ను మరింత గ్రాండ్‌గా నడిపించేందుకు సిద్ధమయ్యారు. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న ‘అగ్నిపరీక్ష’ వేదిక ద్వారా ఎంపికైన ఆరుగురు కామనర్లతో పాటు 10 మంది సెలబ్రిటీలు మొత్తంగా 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెడుతున్నారు.
కొత్త టైమింగ్స్, వినూత్నమైన కాన్సెప్ట్, స్టార్ సెలబ్రిటీల సందడితో వస్తున్న ‘బిగ్ బాస్ 10’ బుల్లితెరపై సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.




