Bigg Boss 10: నామినేషన్ల హీట్‎తో అట్టుడుకిపోయిన హౌస్.. రోహిత్ వర్సెస్ త్రిగుణ్ మాటల యుద్ధం

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ తాజా ఎపిసోడ్ రణరంగాన్ని తలపించింది.

CR Reddy
Published on: 15 Sept 2026 6:27 AM IST
Bigg Boss 10
X

Bigg Boss 10

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ తాజా ఎపిసోడ్ రణరంగాన్ని తలపించింది. తొలి వారంలోనే కంటెస్టెంట్ల అసలు రంగులు బయటపడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య జరిగిన వాగ్వాదాలు అలాగే వ్యక్తిగత విమర్శలు హౌస్‌లో వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కించాయి. 8వ రోజు జరిగిన నామినేషన్ల ప్రక్రియ చాలా ఆసక్తికరంగా సాగింది. బజర్ మోగిన ప్రతీసారి ఇద్దరు కంటెస్టెంట్లు రోప్ తొలగించే టాస్క్‌లో పాల్గొని గెలిచిన వారికి నామినేట్ చేసే అవకాశం దక్కింది. ఈ క్రమంలో రోహిత్ రంగంలోకి దిగి త్రిగుణ్ అలాగే ఝాన్సీలను నామినేట్ చేశాడు. త్రిగుణ్ తనను స్టెరాయిడ్స్ అని సంబోధించాడని రోహిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తన ఆటతీరుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తీవ్రంగా మండిపడ్డాడు. ఝాన్సీ సేఫ్ గేమ్ ఆడుతోందని ఆరోపించగా ఆమె గట్టిగా తిప్పికొట్టింది.

వర్షిణి అలాగే షాలిని మధ్య చెలరేగిన వివాదం

హౌస్‌లో నామినేషన్ల చర్చ నడుస్తున్న సమయంలో షాలిని కలగజేసుకుని మాట్లాడటం పెద్ద రగడకు దారితీసింది. చర్చ జరిగేటప్పుడు మధ్యలో ఎవరూ ఇన్వాల్వ్ కావద్దని చెప్పి స్వయంగా ఆ నియమాన్ని షాలిని బ్రేక్ చేసిందని వర్షిణి గట్టిగా నిలదీసింది. చప్పట్లు కొట్టి మద్దతు తెలపడం వేరు.. నేరుగా గొడవలోకి వచ్చి మాట్లాడటం వేరు అంటూ వర్షిణి చేసిన వాదన అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లడంతో హౌస్‌లో ఉద్రిక్తత మరింత పెరిగింది. నరేష్ కూడా షాలినిని నామినేట్ చేస్తూ సరైన సమయానికి రాకపోవడంపై నిలదీశారు.

సోషల్ మీడియాలో ఝాన్సీపై జరుగుతున్న ట్రోల్స్

మరోవైపు అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఫోక్ సింగర్ ఝాన్సీ తీరుపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యಕ್ತమవుతున్నాయి. కొన్ని విషయాలలో ఆమె తన అభిప్రాయాన్ని బలంగా చెప్పడాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటే మరికొందరు సమర్థిస్తున్నారు. గేమ్ ఇప్పుడిప్పుడే మారుతున్న తరుణంలో ఆమెపై వస్తున్న విమర్శలు ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. మొదటి వారంలోనే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధాలు తారాస్థాయికి చేరడం షో రక్తికట్టడానికి కారణమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ గొడవలు ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.