ఆలియా భట్‌తో గొడవలు నిజమేనా? కోల్డ్ వార్‌పై బాబీ డియోల్ ఓపెన్ టాక్!

Bobby Deol: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ రూమర్ ఎలా పుడుతుందో ఎవరికీ అర్థం కాదు.

Srinivas Rao
Published on: 1 Jun 2026 4:32 PM IST
Bobby Deol
X

ఆలియా భట్‌తో గొడవలు నిజమేనా? కోల్డ్ వార్‌పై బాబీ డియోల్ ఓపెన్ టాక్!

Bobby Deol: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ రూమర్ ఎలా పుడుతుందో ఎవరికీ అర్థం కాదు. ముఖ్యంగా భారీ మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నప్పుడు నటీనటుల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వచ్చే వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫస్ట్ ఫీమేల్ లీడ్ స్పై యూనివర్స్ చిత్రం “ఆల్ఫా” షూటింగ్ సమయంలో.. లీడ్ యాక్ట్రెస్ ఆలియా భట్, విలన్ పాత్ర పోషిస్తున్న బాబీ డియోల్ మధ్య తీవ్రమైన కోల్డ్ వార్ నడిచిందని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ రూమర్లపై లార్డ్ బాబీ డియోల్ నోరు విప్పారు.

సీన్లలో ఆలియా ఇన్‌వాల్వ్‌మెంట్.. అదిరిపోయే రేంజ్‌లో రూమర్స్!

గతంలో వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం.. షూటింగ్ సమయంలో ఆలియా భట్ ప్రతి సీన్ లోనూ, ముఖ్యంగా బాబీ డియోల్ ఉన్న సీన్స్ లో కూడా తన ఓవర్ క్రియేటివ్ ఇన్‌పుట్స్ ఇచ్చేదని, దీనివల్ల బాబీ డియోల్ తీవ్ర అసహనానికి గురయ్యారని వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య పరిస్థితి చేయి దాటిపోవడంతో నిర్మాత ఆదిత్య చోప్రా స్వయంగా రంగంలోకి దిగి సర్దిచెప్పాల్సి వచ్చిందంటూ కథనాలు అల్లారు.

జనాలు ఇంత ఖాళీగా ఉన్నారా? ఆప్ కీ అదాలత్‌లో బాబీ ఫైర్!

ప్రముఖ టాక్ షో ‘ఆప్ కీ అదాలత్’ లో రజత్ శర్మతో మాట్లాడిన బాబీ డియోల్ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. "నా స్నేహితుడు ఒకరు ఈ న్యూస్ లింక్ నాకు పంపినప్పుడు నేను షాక్ అయ్యాను. జనాలు ఇంత ‘ఖాళీగా ఉన్నారా? ఏదో ఒకటి సృష్టించడానికి అనిపించింది. నేను ‘యానిమల్’ లో రణబీర్ కపూర్‌తో పనిచేశాను, ఆ వెంటనే ఆలియాతో ఈ సినిమా ఆఫర్ రాగానే నాకెంతో సంతోషం వేసింది. వీరిద్దరూ నా ఫేవరెట్ యాక్టర్స్. ఆలియా చాలా కష్టపడే అద్భుతమైన నటి. సినిమాలోని యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఆమె ఎంతో సిద్ధమై వచ్చింది" అని బాబీ ప్రశంసించారు.

ఇక రూమర్స్ ఏ స్థాయికి వెళ్లాయో చెప్తూ.. "నేను నొచ్చుకున్నానని నన్ను శాంతింపజేయడానికి ఆదిత్య చోప్రా నాకు మరో సినిమా ఆఫర్ చేశాడని కూడా రాశారు. నేను ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి ఇది అబద్ధం అని నిరూపించుకోలేను. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చూసే 90 శాతం కథలు అస్సలు నిజం కావు" అని బాబీ డియోల్ క్లారిటీ ఇచ్చారు.

వాయిదా పడ్డ ‘ఆల్ఫా’.. ‘వార్ 2’ లో బాబీ ఎంట్రీ!

‘ది రైల్వే మెన్’ ఫేమ్ శివ్ రవైల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆల్ఫా’ చిత్రంలో ఆలియా భట్, శర్వరీ వాఘ్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం డిసెంబర్ 2025లోనే విడుదల కావాల్సి ఉండగా, భారీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కారణంగా 2026కు వాయిదా పడింది. కాగా, ఈ చిత్రంలో బాబీ డియోల్ క్యారెక్టర్‌ను రాబోయే ‘వార్ 2’ పోస్ట్-క్రెడిట్ సీన్‌లోనే ఒక పవర్‌ఫుల్ క్యామియో ద్వారా ఫ్యాన్స్‌కు పరిచయం చేయబోతున్నారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story