Aamir Khan: పెళ్లి ప్రకటన తర్వాత మొదటిసారి జంటగా అమీర్ ఖాన్ - గౌరీ స్ప్రాట్!
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన మూడో పెళ్లి వార్తలతో ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.
Aamir Khan: పెళ్లి ప్రకటన తర్వాత మొదటిసారి జంటగా అమీర్ ఖాన్ - గౌరీ స్ప్రాట్!
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన మూడో పెళ్లి వార్తలతో ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. తాము వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన తర్వాత, అమీర్ ఖాన్ , ఆయన కాబోయే భార్య గౌరీ స్ప్రాట్ తొలిసారిగా జంటగా బహిరంగంగా దర్శనమిచ్చారు. గురువారం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ చేతులు చేతులు కలుపుకుని నడుస్తూ కెమెరాలకు చిక్కారు.
ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు వస్తున్న సమయంలో వీరిద్దరూ చాలా కూల్‌గా, సంతోషంగా సంభాషించుకుంటూ కనిపించారు. అమీర్ ఖాన్ క్యాజువల్ బ్లాక్ టీషర్ట్, మ్యాచింగ్ ట్రౌజర్స్, క్యాప్ ధరించగా.. గౌరీ నావి-బ్లూ కో-ఆర్డ్ అవుట్‌ఫిట్‌లో సింపుల్‌గా మెరిశారు. వీరిని చూడగానే ఫొటోగ్రాఫర్లు ఒకేసారి చుట్టుముట్టడంతో, అమీర్ తన ఫేస్ మాస్క్ తీసివేసి త్వరత్వరగా కారు వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్లను ఉద్దేశించి అమీర్.. "అరె భయ్యా.. కూతురిని ఇంటికి తీసుకువెళ్లాలి, ప్లీజ్ దారి ఇవ్వండి" అంటూ నవ్వుతూనే అభ్యర్థించడం వీడియోలో వైరల్‌గా మారింది.
జూలై 5న వివాహం.. ఇంట్లోనే సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్
ఇటీవల కాలంలో వినిపిస్తున్న కథనాల ప్రకారం, వచ్చే నెలలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతోంది. జూలై 5న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, ఇంట్లోనే చాలా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు అమీర్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ప్రారంభంలో తన 60వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అమీర్ ఖాన్ తన ప్రేయసి గౌరీని మీడియాకు అధికారికంగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
25 ఏళ్ల స్నేహం.. ప్రేమగా మారి!
గత ఏడాది కాలంగా గౌరీ స్ప్రాట్ పలు సందర్భాల్లో అమీర్‌తో కలిసి కనిపిస్తూనే ఉన్నారు. అయితే వీరికి ఒకరికొకరు దాదాపు 25 సంవత్సరాలుగా పరిచయం ఉందని, ఆ సుదీర్ఘ స్నేహమే కొన్నాళ్ల క్రితం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు తీసుకువచ్చిందని బాలీవుడ్ టాక్. గౌరీకి గతంలోనే వివాహమై ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
ఇక అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయనకు ఇది మూడో వివాహం. గతంలో రీనా దత్తాతో (2002లో విడాకులు) వీరికి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును వివాహం చేసుకోగా, వీరికి ఆజాద్ రావు ఖాన్ జన్మించాడు. 2021లో కిరణ్ రావుతో విడిపోయినప్పటికీ, వీరిద్దరూ ఇప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటూ కొడుకు బాధ్యతలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 60 ఏళ్ల వయస్సులో అమీర్ తీసుకుంటున్న ఈ కొత్త నిర్ణయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.




