Boyapati Sreenu: హమ్మయ్య బోయపాటికి హీరో దొరికేశాడు..!
Boyapati Sreenu: నందమూరి బాలకృష్ణతో 'అఖండ 2' సక్సెస్ తర్వాత బోయపాటి శ్రీను తన తదుపరి సినిమాను ఎవరితో చేయబోతున్నారు?
Boyapati Sreenu: హమ్మయ్య బోయపాటికి హీరో దొరికేశాడు..!
Karthi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాస్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం డైరెక్టర్ బోయపాటి శ్రీను. వెండితెరపై ఆయన చూపించే యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-వోల్టేజ్ డైలాగులు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో అఖండ 2 సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మాస్ మొనగాడు, ఇప్పుడు తన తదుపరి అడుగును ఎటువైపు వేయబోతున్నారనే ఉత్కంఠకు తెర దించుతూ ఒక సంచలన వార్త బయటకు వచ్చింది.
సరిహద్దులు దాటుతున్న మాస్ డైరెక్టర్
నందమూరి బాలయ్యతో వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్లు కొట్టిన బోయపాటి, తాజా సమాచారం ప్రకారం తమిళ హీరో కార్తీ కోసం ఒక అదిరిపోయే కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని ఫ్లాపులు రావడంతో టాలీవుడ్ హీరోలు ఆచి తూచి అడుగులు వేస్తున్న తరుణంలో, బోయపాటి తన మార్కెట్‌ను విస్తరించుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా, తమిళంలో కూడా తన మార్క్ యాక్షన్ సినిమాతో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు.
కార్తీ-బోయపాటి కాంబినేషన్
హీరో కార్తీకి కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన చేసే సినిమాల్లో క్లాస్ అప్పీల్‌తో పాటు మాస్ యాక్షన్ కూడా ఉంటుంది. అలాంటి వెర్సటైల్ హీరోకు బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్ తోడైతే, థియేటర్లలో జాతర ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా కూడా పక్కా యాక్షన్ డ్రామా నేపథ్యంలోనే ఉండబోతోందని సమాచారం. కార్తీ వంటి ప్రతిభావంతుడైన నటుడు బోయపాటి విజన్‌ను వెండితెరపై ఎలా ఆవిష్కరిస్తారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తమిళ తంబీలను అలరించేందుకు సిద్ధం
ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే, బోయపాటి శ్రీను కోలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినట్లవుతుంది. కార్తీతో సినిమా చేయడం వల్ల అటు తమిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లోనూ భారీ మార్కెట్ దక్కే అవకాశం ఉంది. అఖండ 2 తర్వాత మరో ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన చేయని బోయపాటి, త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.




