Divorce: పెళ్లి రోజు సర్‌ప్రైజ్ అని చెప్పి విడాకులు ఇచ్చాడు.. కన్నీళ్లు పెట్టుకున్న తెలుగు హీరోయిన్
Celina Jaitly: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతాయో.. విడాకుల వార్తలు కూడా అంతే షాకింగ్‌గా తెరపైకి వస్తుంటాయి. వెండితెరపై నవ్వుతూ కనిపించే కొందరు హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల్లో వెలుగుల వెనుక ఎవరూ ఊహించని చీకటి కోణాలు ఉంటాయి.
Divorce: పెళ్లి రోజు సర్‌ప్రైజ్ అని చెప్పి విడాకులు ఇచ్చాడు.. కన్నీళ్లు పెట్టుకున్న తెలుగు హీరోయిన్
Celina Jaitly: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతాయో.. విడాకుల వార్తలు కూడా అంతే షాకింగ్‌గా తెరపైకి వస్తుంటాయి. వెండితెరపై నవ్వుతూ కనిపించే కొందరు హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల్లో వెలుగుల వెనుక ఎవరూ ఊహించని చీకటి కోణాలు ఉంటాయి. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన సెలీనా జైట్లీ జీవితంలో జరిగిన ఒక గుండెలలిసే ఘోరం ఇప్పుడు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన 15వ పెళ్లి రోజున భర్త ఇస్తాడనుకున్న ఒక సర్‌ప్రైజ్.. ఆమె జీవితాన్నే తలకిందులు చేస్తుందని ఆమె కలగనైనా ఊహించలేదు.
మంచు విష్ణు సరసన 'సూర్యం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, బాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్‌గా ఒక వెలుగు వెలిగింది సెలీనా జైట్లీ. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే 2011లో ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి, ముగ్గురు పిల్లలతో విదేశాల్లో సెటిలైపోయింది. అందరూ ఆమె జీవితం చాలా హ్యాపీగా సాగిపోతోందని అనుకున్నారు. కానీ, అంతా బాగుంది అనుకునేలోపే విడాకుల బాంబ్ పేలింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సెలీనా జైట్లీ కన్నీరుమున్నీరవుతూ చెప్పిన విషయాలు వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. మా 15వ పెళ్లి రోజున నా భర్త నాకు ఏదో పెద్ద సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూశాను. ఆ రోజు నన్ను కారులో ఎక్కించుకుని పోస్టాఫీసుకు తీసుకెళ్లాడు. అక్కడ నా చేతిలో కొన్ని లీగల్ పేపర్లు పెట్టాడు. ఆ పేపర్లన్నీ జర్మన్ భాషలో ఉన్నాయి. నాకు జర్మన్ రాదు. అందులో ఏముందో చెప్పమని అడిగితే.. అతను ఏమాత్రం సమాధానం చెప్పకుండా నన్ను నడిరోడ్డుపై వదిలేసి కారులో వెళ్ళిపోయాడు.
నడిరోడ్డుపై ఒంటరిగా మిగిలిపోయిన సెలీనా, ఎలాగోలా ఇంటికి చేరుకుంది. ఆ పేపర్లలో ఏముందో తెలుసుకోవడానికి తన పిల్లల సాయం తీసుకుంది. నా భర్త నా క్యారెక్టర్‌పై చేసిన దారుణమైన, అసహ్యకరమైన ఆరోపణలను నా సొంత పిల్లల నోటి నుంచే నేను వినాల్సి వచ్చింది. మొదట ఇదంతా ఒక ప్రాంక్ లేదా జోక్ అనుకున్నాను. కానీ అది నిజంగానే విడాకుల నోటీసు అని తెలిసి నా గుండె పగిలిపోయింది అని సెలీనా ఆవేదన వ్యక్తం చేసింది.
కేవలం విడాకుల నోటీసు ఇవ్వడమే కాకుండా, సెలీనాపై ఆమె భర్త, అత్తింటి వారు మానసిక, శారీరక వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఆమెను తిరిగి ముంబై వెళ్లనివ్వమని, ఒకవేళ పిల్లలు కావాలనుకుంటే ఆస్ట్రియాలోనే ఉండి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకోవాలంటూ కఠినమైన కండిషన్లు పెట్టారట. దీంతో లబోదిబోమన్న ఈ మాజీ హీరోయిన్.. తన భర్త, అత్తింటి వారిపై గృహహింస, తీవ్రమైన వేధింపుల కేసులు పెట్టింది. భారీ మొత్తంలో భరణం, నష్టపరిహారం డిమాండ్ చేస్తూ న్యాయపోరాటానికి దిగింది. గ్లామర్ ప్రపంచాన్ని ఏలిన ఒక స్టార్ హీరోయిన్ జీవితం, ఒకే ఒక్క రోజులో ఇలా కోర్టులు, కేసుల చుట్టూ తిరిగేలా తయారవ్వడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. విడాకుల వివాదం ముదరడంతో ప్రస్తుతం ఆమె భవిష్యత్తు పూర్తిగా గందరగోళంలో పడింది.




