విజయ్-త్రిషల బంధంపై చార్మీ కౌర్ షాకింగ్ కామెంట్
Charmme Kaur: నటి త్రిష కృష్ణన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
విజయ్-త్రిషల బంధంపై చార్మీ కౌర్ షాకింగ్ కామెంట్
Charmme Kaur: నటి త్రిష కృష్ణన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా, ప్రముఖ నటి, నిర్మాత చార్మీ కౌర్ చేసిన ఒక కామెంట్, తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ , త్రిషల మధ్య ఉన్న బంధంపై వస్తున్న ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలకు ఈ కామెంట్ ఒక రకమైన 'అప్రకటిత ధృవీకరణ'గా అభిమానులు భావిస్తున్నారు.
చార్మీ కామెంట్.. నెట్టింట రచ్చ!
త్రిష పోస్ట్ చేసిన ఫోటోకు చార్మీ కౌర్ స్పందిస్తూ, "ప్యూర్ గోల్డ్ కపుల్ (Pure gold couple) అని కామెంట్ చేయడమే కాకుండా, ఎన్నో హార్ట్ ఎమోజీలను జత చేశారు. చార్మీ చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండస్ట్రీలో ఉన్న వారికి వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి తెలుసని, అందుకే చార్మీ అలా స్పందించారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్, త్రిషల వైపు నుండి ఎటువంటి స్పందన రాలేదు.
చార్మీ కౌర్ ప్రస్తుతం 'స్లమ్ డాగ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, టబు, దునియా విజయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
పాత జ్ఞాపకాలు.. మళ్ళీ చర్చల్లోకి!
విజయ్ , త్రిష తమ వ్యక్తిగత సంబంధంపై ఇప్పటివరకు ఏ రోజూ బహిరంగంగా స్పందించలేదు. అయితే, ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా మే 10న విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో త్రిష అక్కడ కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు ఈ ఏడాది చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు వారిద్దరూ కలిసి, మ్యాచింగ్ క్రీమ్ అండ్ గోల్డ్ దుస్తుల్లో హాజరవ్వడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.
విజయ్ తన రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ, త్రిషతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఇలా కొనసాగించడం అభిమానుల్లో కొత్త ఆసక్తిని కలిగిస్తోంది. చార్మీ కామెంట్ తర్వాత, వారిద్దరి మధ్య ఉన్నది స్నేహమా లేక అంతకంటే ఎక్కువ బంధమా? అన్నది ఇప్పుడు ఇంటర్నెట్‌లో అతిపెద్ద ప్రశ్నగా మారింది.




