Tollywood: 'మెగావర్స్'లో గెస్టులుగా పవన్, చరణ్, ప్రభాస్.? నెట్టింట ట్రెండింగ్!
Tollywood: చిరంజీవి హోస్ట్ చేస్తున్న 'మెగావర్స్' షోకు పవన్, చరణ్, ప్రభాస్ గెస్టులని టాక్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tollywood: 'మెగావర్స్'లో గెస్టులుగా పవన్, చరణ్, ప్రభాస్.? నెట్టింట ట్రెండింగ్!
Tollywood: మెగాస్టార్ చిరంజీవి నెట్‌ఫ్లిక్స్‌లో 'మెగావర్స్' అనే సెలబ్రిటీ టాక్ షోలో హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోపై ఇప్పుడు క్రేజీ బజ్ వినిపిస్తోంది. రాబోయే ఎపిసోడ్స్‌లో టాలీవుడ్ టాప్ స్టార్స్ గెస్టులుగా రానున్నారన్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.
ఈ షోలో ఇప్పటికే కమల్ హాసన్, బ్రహ్మానందం, సునీల్, సత్య వంటి ప్రముఖులు గెస్టులుగా వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. చిరంజీవితో కలిసి వీరు పంచుకున్న విశేషాలు షోకు మంచి రెస్పాన్స్ తెచ్చిపెట్టాయని సమాచారం. తర్వాతి ఎపిసోడ్స్‌లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, త్వరలో డార్లింగ్ ప్రభాస్ కూడా గెస్ట్‌గా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ముగ్గురి ఎంట్రీ నిజమైతే 'మెగావర్స్'పై ఆసక్తి మరింత పెరగనుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే, చిరంజీవి బాబీ దర్శకత్వంలో 'కాకా' సినిమా చేస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇందులో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' కూడా లైన్‌లో ఉంది. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా, రెండు సినిమాలు ఒకే రోజు వస్తాయని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




