Daddy Movie: డాడీ సినిమా ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి కాదట.. మరెవరంటే.?

Daddy Movie: మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమా కథను మొదట వెంకటేష్‌కి బాగుంటుందని సూచించినట్లు వస్తున్న వార్తలు.

Ravi
By Ravi
Published on: 4 Oct 2026 8:08 PM IST
Daddy Movie
X

Daddy Movie: డాడీ సినిమా ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి కాదట.. మరెవరంటే.?

Daddy Movie: భారతీయ సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలు ఊహించని విధంగా ప్రయాణం సాగిస్తుంటాయి. టాలీవుడ్‌లో ఎప్పటికీ ప్రత్యేక నిలిచిపోయే క్లాసిక్ చిత్రాలలో 'డాడీ' సినిమా ఒకటిగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కూతురు కోసం తండ్రి పడే తపన నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సినీ వర్గాలలో వైరల్ అవుతోంది.

ఈ సినిమా కథను ప్రముఖ రచయిత భూపతి రాజా మొదట మెగాస్టార్ చిరంజీవికి వినిపించారట. కథ విన్న వెంటనే చిరంజీవి ఈ పాత్రకు తాను సరిగ్గా సరిపోనని భావించారట. చిత్రంలో హీరో పాత్ర జైలుకు వెళ్లడం, కూతురు మరణానికి కారణం కావడం అలాగే భార్య దూరం కావడం వంటి బలమైన భావోద్వేగాలు ఉంటాయని తెలిపారు. ఇలాంటి సెంటిమెంట్ పాత్రలలో తనకంటే ప్రముఖ నటుడు వెంకటేష్ అయితే చాలా బాగా సూట్ అవుతారని ఆయన సలహా ఇచ్చారట. ఈ కథకు వెంకటేష్ నటన మరింత న్యాయం చేస్తుందని చిరంజీవి నిజాయితీగా అభిప్రాయపడ్డారు.

అయితే రచయిత భూపతి రాజా మాత్రం ఈ కథ చిరంజీవి చేస్తేనే ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందని బలంగా నమ్మారట. మెగాస్టార్‌తోనే ఈ సినిమా చేయాలని ఆయన పట్టుబట్టడంతో చివరకు చిరంజీవి అంగీకరించినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. సినిమాలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల కంట తడి పెట్టించాయి. చిరంజీవి అద్భుతమైన నటనతో పాటు సిమ్రాన్ అభినయం చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి.

ఇందులోని పాటలు కూడా అప్పట్లో మ్యూజికల్ హిట్‌గా నిలిచి ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. సినిమా విడుదలైన ఇన్ని సంవత్సరాలు గడిచినా దీనికి సంబంధించిన విశేషాలు అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఒకవేళ ఈ సినిమా వెంకటేష్ చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదోనని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ చిరంజీవి చేసిన ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.