Chiranjeevi: చిరంజీవి ఏపీ బ్రాండ్ అంబాసిడర్ రూమర్లకు చెక్.. క్లారిటీ ఇచ్చిన టీమ్!
Chiranjeevi: చిరంజీవి ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారంటూ వస్తున్న వార్తలపై ఆయన పిఆర్ టీమ్ స్పందించింది.
Chiranjeevi: చిరంజీవి ఏపీ బ్రాండ్ అంబాసిడర్ రూమర్లకు చెక్.. క్లారిటీ ఇచ్చిన టీమ్!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై చిరంజీవి పిఆర్ టీమ్ స్పందిస్తూ స్పష్టతనిచ్చింది.
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవిని నియమించారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన టీమ్ అధికారికంగా ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న ఇలాంటి అసత్య ప్రచారాలను, ధ్రువీకరించని వార్తలను అభిమానులు మరియు ప్రజలు ఎవరూ నమ్మవద్దని కోరింది.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. "మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. దయచేసి ఎలాంటి ఆధారాలు లేని వార్తలను, ఊహాగానాలను షేర్ చేయవద్దు" అని విజ్ఞప్తి చేసింది. దీంతో గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న వార్తలకు తెరపడింది.




