Salman Khan: సల్మాన్ ఖాన్‌ అసలు రూపం అప్పుడే తెలిసింది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ అంటే క్రమశిక్షణ ఉండదని, సెట్స్‌కు ఆలస్యంగా వస్తారని ప్రచారం చేసే వారికి నటి చిత్రాంగద సింగ్ గట్టి సమాధానం ఇచ్చారు.

Naresh.k
Published on: 26 April 2026 10:20 AM IST
Salman Khan
X

Salman Khan: సల్మాన్ ఖాన్‌ అసలు రూపం అప్పుడే తెలిసింది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Chitrangda Singh: చిత్రాంగద సింగ్.. ఈ పేరు వినగానే ఒక హుందాతనం, అద్భుతమైన నటన గుర్తుకొస్తాయి. తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను చూసిన ఈమె, విజయం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టారు. కేవలం అదృష్టం ఉంటే సరిపోదని, కష్టపడే తత్వం, నిరంతరం మనల్ని మనం మెరుగుపరుచుకునే గుణం ఉండాలని ఆమె స్పష్టం చేశారు.సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు.

కానీ, తన తండ్రి నేర్పిన క్రమశిక్షణే తనను ఈ స్థాయికి చేర్చిందని చిత్రాంగద గర్వంగా చెబుతారు. అవకాశం ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. కానీ అది వచ్చినప్పుడు మనం సిద్ధంగా లేకపోతే, అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు" అంటూ నేటి తరం నటీనటులకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పారు. తన మొదటి సినిమాలోనే బలమైన పాత్ర దక్కడం తన అదృష్టమని, ప్రతి సినిమా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి సాయపడిందని ఆమె వివరించారు.

సల్మాన్ గురించి అపోహలు.

ఇక సల్మాన్ ఖాన్‌తో తనకున్న అనుబంధం గురించి చిత్రాంగద చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 'మాతృభూమి' షూటింగ్ సమయంలో సల్మాన్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను ఆమె గుర్తు చేసుకున్నారు. సల్మాన్ ఖాన్ గురించి బయట చాలా రకాల పుకార్లు ఉన్నాయి. ఆయన సెట్స్‌కు ఆలస్యంగా వస్తారని, ప్రొఫెషనలిజం ఉండదని చాలామంది నాకు ముందే చెప్పారు. దీంతో మొదట్లో నేను కూడా కాస్త ఆందోళన చెందాను. కానీ ఆయనతో పనిచేయడం మొదలుపెట్టాక నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది అని ఆమె అన్నారు.

సమయపాలన పాటించిన భాయ్

సల్మాన్ ఖాన్ వ్యక్తిత్వం గురించి చెబుతూ.. ఆయన సెట్స్‌లో ఉన్నారంటే అక్కడ ఒక పండగ వాతావరణం ఉంటుంది. కేవలం తోటి నటీనటులనే కాదు, సామాన్య క్రూ మెంబర్స్‌ని కూడా ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అందరితో చాలా సులభంగా కలిసిపోతారు అని కొనియాడారు. అన్నింటికంటే ముఖ్యంగా ఒక ఆసక్తికర విషయాన్ని ఆమె బయటపెట్టారు. నేను ఉదయాన్నే షూటింగ్‌కు వస్తానని సల్మాన్‌కు తెలుసు. నా కోసం ఆయన తన అలవాటును మార్చుకుని, అందరికంటే ముందే సెట్స్‌కు వచ్చేవారు. ఆయనలో ఉన్న ఆ గొప్ప మంచితనం, ఎదుటివారి పట్ల ఉన్న గౌరవం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి అంటూ సల్మాన్ మంచితనాన్ని చిత్ర పరిశ్రమ ముందు ఉంచారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story