Daisy Shah: తల్లి కావాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు..హీరోయిన్‌ బోల్డ్ కామెంట్స్

Daisy Shah: టాలీవుడ్‌లో తనకు ఎదురైన లైంగిక వేధింపులపై డైసీ షా సంచలన ఆరోపణలు చేశారు.

Naresh.k
Published on: 18 April 2026 12:00 PM IST
Daisy Shah
X

Daisy Shah

Tollywood: సినీ ప్రపంచంలో గ్లామర్ వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను, తన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర మలుపులను బయటపెట్టి నటి డైసీ షా ఒక్కసారిగా సంచలనం సృష్టించారు. హిందీ, కన్నడ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తాజాగా టాలీవుడ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. డైసీ షా తెలుగు తెరపై ఎందుకు ఎక్కువగా కనిపించలేదన్న ప్రశ్నకు ఆమె దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.

గతంలో ఒక తెలుగు నిర్మాత సినిమా చర్చల పేరుతో తనను పిలిచి, అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. సినిమా ఆఫర్ ఇస్తామని పిలిచి, ఆ నిర్మాత నన్ను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించారు.నాపై చేతులు వేస్తూ, నన్ను తన ఉచ్చులోకి లాక్కోవాలని చూశారు. నాకు ఇష్టం లేకుండా ఎవరైనా నన్ను తాకితే నా ఒంటిపై తేళ్లు పాకినట్టు అనిపిస్తుంది. ఆ సంఘటన తర్వాత మళ్లీ నేను టాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు అంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు.

ఇక పెళ్లి వద్దే వద్దు

తన వ్యక్తిగత జీవితం గురించి కూడా డైసీ అత్యంత నిజాయితీగా మాట్లాడారు. తాను ఇప్పటికే ఇద్దరు వ్యక్తులతో సహజీవనం చేశానని, కానీ ఆ రెండు బంధాలు తనకు తీరని చేదు అనుభవాలనే మిగిల్చాయని వెల్లడించారు. ఆ చేదు జ్ఞాపకాల వల్లే తనకు పెళ్లి, సంసారం అనే అంశాలపై పూర్తిగా విరక్తి కలిగిందని, భవిష్యత్తులో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. పెళ్లిపై విరక్తి కలిగినా, మాతృత్వంపై మాత్రం తనకు ఎంతో మక్కువ ఉందని డైసీ షా ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

నాకు తల్లిని కావాలని కోరిక ఉంది. కానీ దాని కోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నా అండ కణాలను శీతలీకరణ పద్ధతిలో భద్రపరిచాను. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తల్లిని అవుతాను. ప్రస్తుతం తన మనసుకు నచ్చినట్టుగా, ఎవరికీ తలవంచకుండా స్వేచ్ఛగా బతకాలని నిర్ణయించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. తనపై జరిగిన వేధింపుల గురించి ఆమె చేసిన ఈ ధైర్యవంతమైన వ్యాఖ్యలు, సమాజం విధించిన కట్టుబాట్లను కాదని ఆమె తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Naresh.k

Naresh.k

Next Story