Shrasti Verma: బీజేపీలో చేరిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ!

Shrasti Verma: ప్రముక డ్యాన్స్ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ ఫేమ్ శ్రష్టి వర్మ తెలంగాణ బిజెపిలో చేరారు.

Arun Chilukuri
Published on: 17 Aug 2026 2:27 PM IST
Shrasti Verma
X

Shrasti Verma: బీజేపీలో చేరిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ!

Shrasti Verma: ప్రముఖ టాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ ఫేమ్ శ్రష్టి వర్మ భారతీయ జనతా పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. శ్రష్టి వర్మతో పాటు పలువురు వర్ధమాన కళాకారులు, యవజనులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ.. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఏకమవుతున్న ప్రస్తుత తరుణంలో, యువత రాజకీయాల వైపు రావడం మరియు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా పట్టణంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రష్టి వర్మ, భరతనాట్యం నేర్చుకుని 8 ఏళ్ల వయసులోనే ‘తాజ్ మహోత్సవ్’ వంటి జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. చిన్నతనంలో పైలట్ కావాలనుకున్నప్పటికీ, డ్యాన్స్ పట్ల ఉన్న మక్కువతో ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ లో కో-డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. ‘ఢీ-జోడీ’ సిరీస్‌తో ప్రేక్షకుల్లో, జడ్జిలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రష్టి వర్మ, తక్కువ సమయంలోనే అగ్ర కథానాయకులతో పని చేసే అవకాశం దక్కించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ చిత్రంలోని ‘నువ్వు కావాలయ్యా’ పాటకు ఆమె సమకూర్చిన నృత్యరీతులు సంచలనం సృష్టించాయి. అల్లు అర్జున్ ‘పుష్ప-2’ చిత్రంలోని ‘సూసేకి..’ పాట ఆమెకు కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చిపెట్టింది.

వీటితో పాటు ‘అల వైకుంఠపురములో’, ‘క్రాక్’, ‘బీస్ట్’, ‘గేమ్ ఛేంజర్’, ‘మనమే’, మరియు హిందీ చిత్రం ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ వంటి పలు ప్రతిష్టాత్మక చిత్రాలకు ఆమె పనిచేశారు. ఇటీవల ప్రసారమైన ‘బిగ్ బాస్: సీజన్-9’ లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొని అలరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story