Bigg Boss 10: ముకేష్‌ను పట్టుకుని ఉతికారేసిన దేబ్జానీ.. బిగ్ బాస్ ఇంట్లో సరికొత్త రొమాంటిక్ డ్రామా
Bigg Boss 10: హౌస్‌లో ఆటపాటలతో పాటు కంటెస్టెంట్ల మధ్య గొడవలు, లవ్ ట్రాక్‌లు ఎపిసోడ్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి.
Bigg Boss 10
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. హౌస్‌లో ఆటపాటలతో పాటు కంటెస్టెంట్ల మధ్య గొడవలు, లవ్ ట్రాక్‌లు ఎపిసోడ్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా ముకేష్ గౌడ, దేబ్జానీ మధ్య నడుస్తున్న సరదా సంభాషణలు, హౌస్‌మేట్స్ మధ్య తీవ్రమవుతున్న కెప్టెన్సీ టాస్క్ పోరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
పూల్‌లో వర్షిణితో ముకేష్.. దేబ్జానీ అలుకలు
గత వారం వీకెండ్‌లో నాగార్జున ముందు ముకేష్‌పై తన ఇష్టాన్ని బయటపెట్టిన దేబ్జానీ, ఈ ఎపిసోడ్‌లో మరింత హైలైట్ అయింది. ముకేష్, వర్షిణిలు స్విమ్మింగ్ పూల్‌లో జలకాలు ఆడి బయటకు రాగా, దేబ్జానీ వారిని సరదాగా నిలదీసింది. "ఒక పరాయి అమ్మాయితో బట్టలు లేకుండా పూల్‌లోకి ఎలా దిగుతావు? నాకు ఇష్టమని చెప్పి నన్ను మోసం చేస్తావా?" అంటూ ముకేష్‌ను దేబ్జానీ క్యూట్‌గా ప్రశ్నించడం నవ్వులు పూయించింది. రామ్ ప్రసాద్ కూడా దేబ్జానీకి మద్దతుగా నిలవడంతో ఈ ఫన్నీ డిస్కషన్ షోకే హైలైట్‌గా నిలిచింది.
కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో హోరాహోరీ పోరు
ఈ వారం హౌస్‌లో మొదటి కెప్టెన్ అయ్యేందుకు ఆడియెన్స్ ఓటింగ్ ఆధారంగా త్రిగుణ్, రోహిత్, షాలిని, అమన్, దేబ్జానీ, ముకేష్ గౌడ, ఝాన్సీ, రామ్ ప్రసాద్‌లు కంటెండర్లుగా ఎంపికయ్యారు. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా గజిబిజీగా ఉన్న అక్షరాలతో పదాలను గుర్తించే ప్రక్రియలో కంటెస్టెంట్లు ఎవరికి వారు వ్యూహాలు పన్నారు. ఈ పోటీలో ఎవరు అనర్హులు అనే దానిపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ టాస్క్ ప్రక్రియలో త్రిగుణ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ, రోహిత్‌లు ఎలిమినేట్ కాగా, మిగిలిన కంటెస్టెంట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది.
రోహిత్ - ఝాన్సీ మధ్య మాటల యుద్ధం
మరోవైపు హౌస్‌లో గ్రూప్ పాలిటిక్స్, వాదనలు తారాస్థాయికి చేరాయి. రోహిత్ ఆటతీరుపై ఝాన్సీ మండిపడగా, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భజన అనే పదంపై జరిగిన చర్చ హౌస్‌లో పెద్ద రచ్చకు దారితీసింది. త్రిగుణ్ ప్రతి విషయంలోనూ కలుగజేసుకోవడంపై రోహిత్ ఫైర్ అయ్యాడు. ఇలా ఒకవైపు నామినేషన్ల వేడి తగ్గకముందే, కెప్టెన్సీ టాస్క్‌ల హీట్ హౌస్‌లో వాతావరణాన్ని వేడెక్కించింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌ను పెంచేసింది. ఆటతో పాటు లవ్ ట్రాక్‌లు, గొడవలతో రాబోయే రోజుల్లో హౌస్‌లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.




