Delulu: టీజర్ అంతా నువ్వులే నవ్వులు.. ఆ లాస్ట్ డైలాగ్ ఏదైతే ఉందో..!

Delulu: ట్రెండింగ్ పదం టైటిల్‌గా వస్తున్న ‘డెలులు’ మూవీ టీజర్ విడుదలైంది. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ టీజర్‌లోని డైలాగ్స్, వినోదాత్మక సన్నివేశాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Gagan kumar
Updated on: 5 Sept 2026 9:20 AM IST
Delulu
X

Delulu: టీజర్ అంతా నువ్వులే నవ్వులు.. ఆ లాస్ట్ డైలాగ్ ఏదైతే ఉందో..!

Delulu Teaser: ప్రస్తుత తరం యువతలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘డెలులు’ (Delulu) అనే సరికొత్త పదాన్నే టైటిల్‌గా మార్చుకుని తెరకెక్కుతున్న చిత్రం ‘డెలులు’. ప్రయోగాత్మక టైటిల్‌తోనే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తుండగా, ప్రీతం కస్తూరి దర్శకత్వం వహిస్తున్నారు.

విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు సమకూర్చగా.. రెష్మిత్ ఎస్. కౌశిక స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఒక నిమిషం 32 సెకండ్ల నిడివితో వచ్చిన ఈ టీజర్ ‘బ్రేకప్ దేవా’ అనే డిఫరెంట్ డైలాగ్‌తో ఎంతో ఆసక్తికరంగా మొదలవుతుంది. టీజర్ ఆద్యంతం యూత్‌ఫుల్ ఫన్, ఆకట్టుకునే సంభాషణలతో సాగుతూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది.

టీజర్‌లో వచ్చే ‘‘ఆడదానివైన నువ్వు.. చీప్‌గా ఓ మగాడి కోసం మారతావా అంటావా.. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకు’’, ‘‘నువేమైనా ఫాదర్ ఆఫ్ ఇండియానా?’’, ‘‘నువ్వు అత్తాపూర్‌కు రారా.. నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా’’ వంటి మార్క్ డైలాగులు నవ్వుల పూవులు పూయిస్తూ సినిమాపై క్యూరియాసిటీని ఒక్కసారిగా పెంచేశాయి.

ముఖ్యంగా ఓ ఇంటి నేపథ్యంలో సాగే కథనం, పాత్రల మధ్య సాగే వినోదాత్మక సంఘటనలు, వాటి కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కేవలం యూత్‌ఫుల్ కామెడీ మాత్రమే కాకుండా, కుటుంబ సమేతంగా ఆస్వాదించే ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉన్నట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.

సాంకేతికంగా జై రాజ్ నాయుడు సినిమాటోగ్రఫీ, హరికృష్ణ కురపాటి ఎడిటింగ్ బాగుండగా, ఆది చెబ్రోలు అందించిన సంగీతం సన్నివేశాలలోని ఫన్‌ను మరింతగా ఎలివేట్ చేసింది.

ఈ చిత్రంలో విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీ రామ మండవ, అభినయ్ తుల తదితర యువ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ట్రెండీ కాన్సెప్ట్, బోలెడంత కామెడీ, నేటి తరం సరికొత్త ఆలోచనలకు అద్దం పడుతూ వస్తున్న ఈ ‘డెలులు’ థియేటర్లలో ఏ స్థాయిలో సందడి చేస్తుందో వేచి చూడాలి.


Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story