Rajinikanth: రజినీకాంత్ చిత్రంలో రామ్ పోతినేని.. కాంబో అదిరిందిగా.! దర్శకుడు ఎవరంటే.?

Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్ 'ధర్మన్' చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని విలన్ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Ravi
By Ravi
Published on: 20 Aug 2026 7:11 PM IST
Rajinikanth
X

Rajinikanth: రజినీకాంత్ చిత్రంలో రామ్ పోతినేని.. కాంబో అదిరిందిగా.! దర్శకుడు ఎవరంటే.?

Rajinikanth: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్‌స్టార్‌గా, దశాబ్దాలుగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'ధర్మన్' గురించి కోలీవుడ్ సర్కిల్‌లో ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక కీలకమైన పాత్రలో నటించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ చిత్రంలో ఆయన ఏకంగా విలన్ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తుండటంతో సినీ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతోంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌లో రజినీకాంత్ మామగా, సిమ్రన్ అత్తగా నటించనున్నారు. వారి కుమార్తె రాశీ ఖన్నాకు జోడీగా రామ్ పోతినేని అల్లుడిగా నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రామ్ విలన్ పాత్రలో కనిపించట్లేదని తెలుస్తోంది. మామ, అల్లుడి మధ్య సినిమా మొత్తంలో ఈగో క్లాష్స్ నడుస్తుంటాయని, దానినే రసవత్తరంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. అశ్వీత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ పోతినేని ఎంట్రీపై త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. స్టార్ హీరోల కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై అభిమానులలో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీకాంత్ సినిమాలలో యాంటీ రోల్స్ ఎప్పుడూ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇప్పుడు ఆ పాత్రలో రామ్ పోతినేని నటిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

దర్శకుడు అశ్వీత్ మారిముత్తు ఈ కథను ఎంతో పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది. త్వరలోనే రామ్ పోతినేని షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story