Dhurandhar 2 Collections: దురంధర్ 2 కలెక్షన్ల ఊచకోత.. నాలుగోరోజు రికార్డులన్నీ ఔట్!
Dhurandhar 2 Box Office Collections: దురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. 4 రోజుల్లో ₹750 కోట్లు వసూలు చేసి పఠాన్, RRR ను క్రాస్ చేసింది
Dhurandhar 2 Box Office Collections
Dhurandhar 2 Box Office Collections: కలెక్షన్ల వర్షం.. సునామీ.. ఇలాంటి పాదాలన్నిటినీ దాటేసింది దురంధర్ 2. బాక్సాఫీస్ వద్ద వినిపించే కలెక్షన్ల లెక్కల పదాలను తిరిగి రాసుకోవాల్సిన పరిస్థితి. పెద్ద పెద్ద హీరోలు.. దర్శకులు.. ఎన్నో ఏళ్ళు శ్రమిస్తేనే కానీ రాని అద్భుత విజయం సాధించారు రణవీర్ - ఆదిత్య ధర్. దురంధర్ లాంటి మూవీలకు ఒక కోణంలో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో మూవీ కలెక్షన్లపై ప్రభావం కనిపిస్తుంది. ఈ మూవీకి రెండోరోజు నుంచి అటువంటి ప్రచారం సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా జరుగుతూ వస్తోంది. అయినా కానీ, ఎక్కడా తగ్గలేదు దురంధర్. కొత్త చరిత్రను సృష్టించడమే కాదు.. ఇప్పుడు మూవీలను తీయాలంటే ఎలా తీయాలి అనే పద్ధతిని కూడా కొత్తగా నేర్పించింది దురంధర్ 2. గ్రాఫిక్స్.. భారీ సెట్టింగ్స్.. విపరీతమైన ప్రచార హోరు ఇలాంటి ప్రస్తుత సంప్రదాయాలను అన్నిటినీ నేలకేసి నలిపేసింది ఈ మూవీ. ఆరు నెలల వ్యవధిలో రెండు మూవీలు.. రెండూ ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్. కాసుల సునామీ. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ దర్శకుడూ సాధించలేని విజయం ఇది. నాలుగు రోజుల్లో దురంధర్ 2 ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ 750 కోట్లు! ఈ అంకె చాలు దురంధర్ 2 సంచలనం గురించి చెప్పడానికి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
రణవీర్ సింగ్ 'ధురందర్: ది రివెంజ్' మూవీ నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹750 కోట్లు వసూలు చేసింది. నిన్న, ఆదివారం, దురంధర్ 2 భారతదేశంలో ₹114.85 కోట్లు కొల్లగొట్టింది. దీనితో వీకెండ్ కలెక్షన్స్ లో షారుఖ్ ఖాన్ 'పఠాన్', రాజమౌళి 'RRR' క్రియేట్ చేసిన రికార్డును ఇది బద్దలు కొట్టింది.
షారుఖ్ ఖాన్ నటించిన "పఠాన్" చిత్రం ఐదు రోజుల పొడిగించిన వారాంతంలో ₹287 కోట్లు వసూలు చేసింది. "బాహుబలి 2" (₹591 కోట్లు), "కల్కి 2898 AD" (₹500 కోట్లు) , "RRR" (₹470 కోట్లు) చిత్రాల మొదటి వీకెండ్ రికార్డులను ధురందర్ 2 తుడిచిపెట్టేసింది.
భారత్ లో రెండో మూవీ..
దురంధర్ 2 మూవీ మొదటి రోజు కలెక్షన్స్ లో అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డు జస్ట్ మిస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ లో పుష్ప 2 కంటే జస్ట్ 12 కోట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో భారత చలన చిత్ర సీమలో అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ సాధించిన రెండో మూవీగా దురంధర్ 2 నిలిచింది. పుష్ప 2 మూవీ 762 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.
2026లో అతిపెద్ద మూవీ..
కేవలం మూడు రోజుల్లోనే, ధురందర్ 2 'బోర్డర్ 2' (₹470 కోట్లు)ను దాటేసి 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఆదివారం నాటి వసూళ్లతో, ఇది 'గదర్ 2' (₹691 కోట్లు) - 'సాలార్' (₹690 కోట్లు) మూవీస్ మొత్తం కలెక్షన్స్ కూడా దాటేసింది.
₹2,000 కోట్లు గ్యారెంటీ..
సినిమా కలెక్షన్ల ప్రస్తుత వేగాన్ని బట్టి చూస్తే, ఇది ₹1000 కోట్ల మార్కును సునాయాసంగా అధిగమిస్తుందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. సోమవారంతో పాటు ఈ వీక్ కూడా ఈ సినిమా ఇదే విధంగా తన కలెక్షన్ల సునామీని కొనసాగిస్తే, ఇది ₹2000 కోట్ల మార్కును చేరుకున్న రెండవ హిందీ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.
ధురందర్ రికార్డులు కూడా..
ధురందర్ ఫస్ట్ పార్ట్ భారతీయ - అంతర్జాతీయ బాక్సాఫీసుల వద్ద అద్భుతంగా రాణించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹1,307 కోట్లు వసూలు చేసింది. మనదేశంలో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ ₹1,005.85 కోట్లు కాగా, నెట్ కలెక్షన్స్ సుమారు ₹840 కోట్లుగా ఉన్నాయి. ₹894.49 కోట్లతో ఇది ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది.
"ధురందర్" మూవీకి విదేశీ మార్కెట్లలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విదేశాల్లో ఇది సుమారుగా ₹299.5 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా అమెరికా, కెనడాలో, ఇది ₹193.06 కోట్లకు పైగా వసూలు చేసి "బాహుబలి 2"ను అధిగమించింది. గల్ఫ్ దేశాలలో మూవీ రిలీజ్ కాకపోయినా ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం అంటే మాటలు కాదు.




