Dhurandhar 2: 'ధురందర్ 2' క్లైమాక్స్‌లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. పార్ట్ 3 ఉంటుందా?
Dhurandhar 2 Climax Twist Explained: రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాలో రాకేష్ బేడి పాత్ర చుట్టూ తిరిగే ఆ ఊహించని ట్విస్ట్ ఏంటి? అసలు హంజా అలీ మజారీ గమ్యం ఎటు? ఎండ్-క్రెడిట్ సీన్స్‌లో పార్ట్ 3 గురించి దర్శకుడు ఆదిత్య ధర్ ఎలాంటి హింట్స్ ఇచ్చారు? సినిమా క్లైమాక్స్, తదుపరి భాగంపై పూర్తి విశ్లేషణతో కూడిన సోర్టీని చదవండి.
Dhurandhar 2: 'ధురందర్ 2' క్లైమాక్స్‌లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. పార్ట్ 3 ఉంటుందా?
Dhurandhar 2 Climax Twist Explained: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన మోస్ట్ ఏవైటెడ్ స్పై థ్రిల్లర్ 'ధురందర్: ది రివెంజ్' థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, ఊహించని మలుపులతో ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడుతోంది. ముఖ్యంగా క్లైమాక్స్, ఎండ్-క్రెడిట్ సీన్స్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది.
సినిమా క్లైమాక్స్‌లో రణవీర్ సింగ్ (హంజా అలీ మజారీ) పాకిస్థాన్‌లోని మురిద్కేకు చేరుకుని మేజర్ ఇక్బాల్‌ను (అర్జున్ రాంపాల్) కలుస్తాడు. బలూచ్ యోధుల సాయంతో లష్కర్ శిబిరాన్ని ధ్వంసం చేసే క్రమంలో హంజా శత్రువులకు చిక్కుతాడు. కఠినమైన చిత్రహింసల తర్వాత, అతను భారత్ పంపిన గూఢచారి అని తెలుస్తుంది. అయితే, అజయ్ సన్యాల్ (ఆర్. మాధవన్) తన తెలివితేటలతో ఒక పాకిస్థానీ జనరల్‌ను బ్లాక్మెయిల్ చేసి హంజాను ప్రాణాలతో విడిపించడం సినిమాలో హైలైట్‌గా నిలిచింది.
రాకేష్ బేడి పాత్రతో ఊహించని షాక్..
ఈ సినిమాలో అసలైన ట్విస్ట్ జమీల్ జమాలి (రాకేష్ బేడి) పాత్ర. గత 50 ఏళ్లుగా పాకిస్థాన్‌లో రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్న జమాలి, నిజానికి భారతీయ ఏజెంట్ అని తేలడం ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. ఆయన సాయంతోనే హంజా సురక్షితంగా మాతృభూమికి చేరుకుంటాడు. సినిమా ముగింపులో రణవీర్ తన స్వగ్రామానికి వెళ్తాడా లేక మళ్లీ గూఢచారిగా తన వృత్తిని కొనసాగిస్తాడా అనే సందిగ్ధంలో కథను ముగించి, తదుపరి భాగంపై ఆసక్తిని పెంచారు దర్శకుడు. సినిమా ముగిసిన తర్వాత దర్శకుడు రెండు కీలకమైన సీన్లను జోడించారు.. జస్కిరత్ సింగ్ రంగి (రణవీర్) ఒక మొండి గూఢచారిగా ఎలా మారాడో, కఠినమైన యుద్ధ విద్యలు, విషాల తయారీలో అతను పొందిన శిక్షణను ఈ మాంటేజ్ సీన్లో చూపించారు. రెండవ సీన్లో పాకిస్థానీ జనరల్ షానవాజ్ (రాజ్ జుత్షి) తన సైనికులపై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపిస్తుంది. ఇది కేవలం తదుపరి ముప్పును సూచించే సీన్‌గా కనిపిస్తుంది.
అభిమానులు పార్ట్ 3 గురించి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, ఎండ్-క్రెడిట్ సీన్స్‌లో దాని గురించి డైరెక్ట్ హింట్ ఏదీ లేదు. దర్శకుడు ఆదిత్య ధర్ కేవలం రణవీర్ పాత్ర గతాన్ని, వర్తమానాన్ని వివరించడానికే ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపిస్తుంది. అయితే కచ్చితంగా 'ధురందర్ 3' ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..




