Dhurandhar 2 Collections: ఒక్కసారిగా పడిపోయిన దురంధర్ 2 కలెక్షన్స్.. ఆ రికార్డ్ కష్టమేనా?
Dhurandhar 2 Collections: బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి కలెక్షన్ల వర్షం కురిపించిన దురంధర్ 2 మూవీ 12వ రోజు కలెక్షన్స్ విపరీతంగా పడిపోయాయి.
Dhurandhar 2 Collections
Dhurandhar 2 Collections: దురంధర్ 2.. ఈ మధ్యకాలంలో ఇంత సంచలనం సృష్టించిన మూవీ ఏదీ లేదు. డిసెంబర్ 2025లో దురంధర్ పార్ట్ 1 చేసిన సందడి ఇంకా మర్చిపోకుండానే దురంధర్ పార్ట్ 2 థియేటర్లలోకి వచ్చేసింది. దురంధర్ మూవీతోనే బాగా కనెక్ట్ అయిన ప్రేక్షకులు దురంధర్ 2 కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. దీంతో ఈ మూవీ రిలీజ్ టైమ్ కే పెద్ద హైప్ క్రియేట్ అయింది. ఆ అంచనాలను అందుకుంటూ దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. విడుదలైన దగ్గర నుంచి ఎక్కడా వెనక్కి తగ్గకుండా కలెక్షన్స్ కొల్లగొడుతూనే ఉంది.
ఆదిత్య ధర్ డిసెంబర్లో దురంధర్ సినిమాతోనే 1,300 కోట్లకు పైగా వసూలు చేశాడు. కొన్ని నెలల తర్వాత, ఇప్పుడు మళ్లీ 1,000 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించాడు. 'ధురందర్ 2' కేవలం 11 రోజుల్లోనే మొత్తం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రెండవ శనివారం, ఆదివారం కూడా రికార్డ్ స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది దురంధర్ .
అయితే, 'ధురందర్ 2' 12వ రోజున భారత బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. సోమవారం నాడు 'ధురందర్ 2' కేవలం రూ. 25 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఈ చిత్రం రూ. 2,000 కోట్ల క్లబ్లో చేరుతుందని ఇంతవరకూ అందరూ అంచనా వేశారు. అందుకు తగ్గట్టే, మొదటి పదకొండు రోజులూ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు సోమవారం అనే 12వ రోజు ఒక్కసారిగా కలెక్షన్స్ డ్రాప్ అయిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 12వ రోజు ఆక్యుపెన్సీ కేవలం 23.4 శాతంగా ఉంది. మూవీ మొన్న ఆదివారం వసూళ్లతో (రూ. 68 కోట్లు) పోలిస్తే, సోమవారం వసూల్లాకు భారీ దెబ్బ పడింది.
మొత్తంగా 1400 కోట్లు..
'ధురందర్ 2' చిత్రం మొత్తం వసూళ్లు 875.17 కోట్లు కాగా, దాని గ్రాస్ కలెక్షన్ వెయ్యి కోట్ల రూపాయలను దాటింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1392 కోట్లు సంపాదించింది. విదేశాల నుంచి ఈ మూవీకి 300 కోట్ల రూపాయలకు పైగా రాబడి వచ్చింది. ఇదిలా ఉండగా, 12వ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల జాబితాలో 'ధురందర్ 2' మూడో స్థానంలో నిలిచింది.
'ధురందర్ 2' ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1400 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ సినిమా వసూళ్లు నెమ్మదిగా సాగుతున్నందున, రూ. 2,000 కోట్ల క్లబ్లో చేరడం దీనికి కష్టమవుతుందని అంటున్నారు. 'దంగల్' రూ. 2,000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఆ రికార్డును బద్దలు కొడుతుందా లేదా అన్నదే ప్రశ్న.




