Dhurandhar 2: ‘ధురంధర్ 2’పై స్టార్ సెలబ్రిటీల ప్రశంసలు.. రణవీర్ సింగ్‌కు సొంతింటి సపోర్ట్ ఎక్కడ?

దక్షిణ భారత సినీ పరిశ్రమ నుంచి వచ్చిన మద్దతు ధురంధర్‌ 2 సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచింది. అయితే ఆశ్చర్యకరంగా రణవీర్ సింగ్‌ అత్యంత సన్నిహితులు ఒక్క పోస్ట్ చేయడకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Rishvik
Published on: 21 March 2026 4:19 PM IST
Dhurandhar 2
X

Dhurandhar 2: ‘ధురంధర్ 2’పై స్టార్ సెలబ్రిటీల ప్రశంసలు.. రణవీర్ సింగ్‌కు సొంతింటి సపోర్ట్ ఎక్కడ?

Dhurandhar 2:బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా, ఆదిత్యధర్‌ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ధురంధర్‌ 2’. ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో అదరగొడుతోంది. కేవలం హిందీలోనే రిలీజ్ అయినా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.370 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. శనివారం నాటికే రూ.500 కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది. ఈరోజు నుంచి తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లు ప్రదర్శితమవుతున్నాయి. దాంతో బాక్సాఫీస్ షేక్ కానుంది. అయితే ధురంధర్ 2’సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రణవీర్ సింగ్‌కు సొంతింటి సపోర్ట్ కరువైందంటూ నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు ధురంధర్‌ 2 సినిమాపై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సినిమాకు భారీ హైప్ తీసుకువచ్చారు. దక్షిణ భారత సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఈ మద్దతు సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచింది. అయితే ఆశ్చర్యకరంగా రణవీర్ సింగ్‌ అత్యంత సన్నిహితులు ఒక్క పోస్ట్ చేయడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆయన సతీమణి దీపికా పదుకొనే ఇప్పటివరకు ఈ సినిమాపై పోస్టు చేయకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే బాలీవుడ్‌లోని స్టార్ హీరో, హీరోయిన్స్ స్పందించకపోవడం గమనార్హం.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ధురంధర్‌ 2 సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరుకాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. సినిమా విడుదలైన మూడు రోజులు గడిచినా కూడా దీపికా ఎలాంటి పోస్టు చేయకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే సమయంలో తన అత్తమామలతో కలిసి ముంబైలో జరిగిన ఒక కాన్సర్ట్‌కు హాజరవడం విశేషం. దాంతో సోషల్ మీడియాలో పలువురు దీపికా వైఖరిని ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 'భర్త సినిమా కోసం ఒక్క పోస్టు కూడా పెట్టలేవా?', 'రణవీర్ సింగ్‌కు సొంతింటి సపోర్ట్ ఎక్కడ' అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Rishvik

Rishvik

Next Story