Mouni Roy: నా భార్య సినిమా ఆఫర్ల కోసం అలాంటి పని చేసింది.. హీరోయిన్ భర్త సంచలనం

Mouni Roy: బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ముఖ శస్త్రచికిత్స చేయించుకున్నారంటూ మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Gagan kumar
Published on: 21 Nov 2026 3:27 PM IST
Mouni Roy
X

Mouni Roy: నా భార్య సినిమా ఆఫర్ల కోసం అలాంటి పని చేసింది.. హీరోయిన్ భర్త సంచలనం

Mouni Roy plastic surgery: టెలివిజన్ రంగం నుంచి అడుగుపెట్టి, తన గ్లామర్, అద్భుతమైన నటనతో బాలీవుడ్ వెండితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మౌనీ రాయ్. ‘నాగిని’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత ‘గోల్డ్’, ‘బ్రహ్మాస్త్ర’ వంటి భారీ చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ అందుకుంది. అయితే, మౌనీ కెరీర్ ఎంత గ్రాండ్‌గా కనిపిస్తుందో.. దాని వెనుక ఆమె ఎదుర్కొన్న విమర్శలు, అవమానాలు కూడా అన్నే ఉన్నాయంటూ తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితానికి, ముఖ్యంగా ఆమె ముఖ శస్త్రచికిత్సకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మౌనీ రాయ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో తన రూపం విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం ఉంది. ఆ కారణంగానే అప్పట్లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదని, దీంతో తీవ్ర అభద్రతాభావానికి లోనయ్యారని కథనాలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే తన రూపాన్ని మార్చుకోవడానికి మౌనీ ముఖానికి శస్త్రచికిత్స చేయించుకున్నారంటూ గతంలోనే పలు ఊహాగానాలు చెలరేగాయి. అయితే, ఎప్పటికప్పుడు ఈ వార్తలను కొట్టిపారేస్తూ వచ్చిన మౌనీ, సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్‌ను తాను అస్సలు పట్టించుకోనని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, మౌనీ రాయ్ సర్జరీ విషయంలో ఆమె భర్త సూరజ్ నంబియార్ క్లారిటీ ఇచ్చారంటూ ప్రస్తుతం పలు మీడియా వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ కథనాల ప్రకారం.. కెరీర్ తొలినాళ్లలో రూపం కారణంగా అవకాశాలు కోల్పోయిన మౌనీ, ముఖ శస్త్రచికిత్స కోసం ఓ విదేశీ వైద్యుడిని సంప్రదించారట. అయితే ఈ సర్జరీ వల్ల కొన్ని వైద్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఇది చాలా ప్రమాదకరమని సదరు వైద్యుడు ముందే హెచ్చరించారట. అయినప్పటికీ, కెరీర్ కోసం ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడి మౌనీ శస్త్రచికిత్స చేయించుకున్నారని ఆమె భర్త చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం మౌనీ రాయ్ భర్త పేరుతో ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నప్పటికీ, ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక వీడియో గానీ, ఆధారాలు గానీ బయటకు రాలేదు. గతంలోనూ మౌనీ తన లుక్స్ మార్పుపై స్పందిస్తూ.. కేవలం ఫిట్‌నెస్, డైట్, మేకప్ వల్లే తన రూపంలో మార్పు వచ్చిందని చెప్పుకొచ్చారు. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మౌనీ రాయ్ గానీ, ఆమె భర్త గానీ నేరుగా స్పందించాల్సిందే.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.