Dilip Raj Passes Away : శాండల్‌వుడ్‌లో విషాదం.. దిలీప్ రాజ్ కన్నుమూత.!

Dilip Raj Passes Away : కన్నడ సినీ లోకంలో తీరని విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు , నిర్మాత దిలీప్ రాజ్ (47) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు...

G Krishna
Published on: 13 May 2026 1:45 PM IST
Dilip-Raj-Passes-Away
X

Dilip-Raj-Passes-Away

Dilip Raj Passes Away : కన్నడ సినీ లోకంలో తీరని విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు , నిర్మాత దిలీప్ రాజ్ (47) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లు సమాచారం. ఈ వార్త తెలియగానే శాండల్‌వుడ్ ప్రముఖులు , అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ప్రమోషన్లలో బిజీగా ఉంటూనే అనంత లోకాలకు..

దిలీప్ రాజ్ ఇటీవల తన లేటెస్ట్ సినిమా ‘లవ్ మాక్‌టైల్ 3’ పనుల్లో ఎంతో బిజీగా గడిపారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో, బుధవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, దురదృష్టవశాత్తూ అప్పటికే ఆయన మరణించారని వైద్యులు ధృవీకరించారు. కేవలం 47 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడం అందరినీ కలిచివేస్తోంది.

రిషబ్ శెట్టి నివాళి

దిలీప్ రాజ్ మరణవార్త విన్న ‘కాంతార’ స్టార్ రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. "దిలీప్ రాజ్ ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, చాలా మంచి మనిషి" అని ఆయన కొనియాడారు. పరిశ్రమలోని ఇతర సెలబ్రిటీలు కూడా దిలీప్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

నాటక రంగం నుండి వెండితెర వరకు సాగిన ప్రయాణం

దిలీప్ రాజ్ కెరీర్ రంగస్థల కళాకారుడిగా మొదలైంది. ఆ తర్వాత బుల్లితెరపై ‘జనని’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రంగులి, కుంకుమ భాగ్య, రథసప్తమి వంటి సీరియల్స్ ఆయనను కన్నడ ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. 2005లో ‘బాయ్ ఫ్రెండ్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన ‘మిలాన’ చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించారు. ‘యూ-టర్న్’, ‘ఆర్కెస్ట్రా మైసూరు’ వంటి సినిమాల్లో విభిన్న పాత్రలతో తన సత్తా చాటారు.

నిర్మాతగా , డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా..

నటనతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా దిలీప్ రాజ్ తన మార్క్ చూపించారు. ‘ఆ దినగలు’ సినిమాలో ఆయన వాయిస్ అందరినీ ఆకట్టుకుంది. అలాగే ‘DR క్రియేషన్స్’ బ్యానర్ స్థాపించి ‘పారు’ వంటి పాపులర్ షోలను నిర్మించి సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తన కొత్త సినిమాను సపోర్ట్ చేయమని ఆయన చేసిన పోస్టే చివరి జ్ఞాపకంగా మిగిలిపోయింది. దిలీప్ రాజ్‌కు భార్య నందిత , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నటుడిగా, నిర్మాతగా ఎదుగుతున్న తరుణంలో ఆయన ఇలా అకస్మాత్తుగా మరణించడం ఆయన కుటుంబానికే కాకుండా కన్నడ ఇండస్ట్రీకి కూడా పెద్ద నష్టం.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story