జాసన్ విజయ్ ‘సిగ్మా’ కొత్త విడుదల తేదీ ఫిక్స్!
Sigma: తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ విజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘సిగ్మా’.
జాసన్ విజయ్ ‘సిగ్మా’ కొత్త విడుదల తేదీ ఫిక్స్!
Sigma: తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ విజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘సిగ్మా’ . సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మొదట జూలై 31న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే తండ్రి విజయ్ చివరి చిత్రమైన ‘జన నాయగన్’ కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 18న ‘సిగ్మా’ రిలీజ్!
తాజా సమాచారం ప్రకారం, ఈ హై-వోల్టేజ్ ట్రెజర్ హంట్ , హెయిస్ట్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని సెప్టెంబర్ 18న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా త్వరలనే ప్రారంభించనున్నారు.
నటీనటులు , సాంకేతిక నిపుణులు
ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుండగా, సంపత్ రాజ్, రాజు సుందరం, శివ్ పండిట్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్‌తో దర్శకుడిగా అరంగేట్రం చేసినట్లుగానే, జాసన్ విజయ్ కూడా తన మొదటి చిత్రంతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.




