Trivikram: సూర్యతో సినిమా చేయమని రోజూ భార్య నుంచి డిమాండ్.. త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్!

Trivikram: పాన్ ఇండియా హీరోలలో హీరోల్లో సూర్య, మహేష్ బాబు వయసే వెనక్కి వెళ్తోందని డైరెక్టర్ త్రివిక్రమ్ అన్నారు.

Ravi
By Ravi
Published on: 16 Aug 2026 12:21 PM IST
Trivikram
X

Trivikram: సూర్యతో సినిమా చేయమని రోజూ భార్య నుంచి డిమాండ్.. త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్!

Trivikram: పాన్ ఇండియా హీరోలలో హీరోల్లో సూర్య, మహేష్ బాబు వయసే వెనక్కి వెళ్తోందని డైరెక్టర్ త్రివిక్రమ్ అన్నారు. విశ్వనాధ్ అండ్ సన్స్ సక్సెస్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల జరిగిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సక్సెస్ మీట్ వేదికగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇండియన్ సినిమా రంగంలో పనిచేస్తున్న హీరోలలో సూర్య, మహేష్ బాబుల వయసు మాత్రం రోజురోజుకీ వెనక్కి వెళ్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. వారి ఫిట్‌నెస్ చూస్తుంటే వయసు తగ్గుతున్నట్లు కనిపిస్తుందని ఆయన ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గజినీ సినిమాలోని సంజయ్ రామస్వామి పాత్ర తనకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమని త్రివిక్రమ్ తెలిపారు. ఆ సినిమాలో సూర్య నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. సూర్యతో కలిసి ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉందని, అయితే ఇప్పటివరకు తనకు నచ్చిన సరైన కథను ఆయనకు చెప్పలేకపోయానని త్రివిక్రమ్ వెల్లడించారు. త్వరలోనే ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

తన భార్య సూర్యకు పెద్ద ఫ్యాన్ అని, ఇంట్లో నుంచి కూడా సూర్యతో సినిమా చేయాలని తనకు నిత్యం డిమాండ్ వస్తుందని ఆయన సరదాగా చెప్పారు. మహేష్ బాబుతో ఇప్పటికే సినిమాలు చేసిన త్రివిక్రమ్, ఇప్పుడు సూర్యతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోంది. కాగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్య హీరోగా సినిమా వస్తే ఆ క్రేజ్ వేరేలా ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story