Ellamma First Look : మ్యూజిక్ నుంచి హీరోగా DSP.. 'ఎల్లమ్మ' ఫస్ట్ లుక్‌తో మాస్ సర్‌ప్రైజ్.!
DSP Ellamma First Look : టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులకు చిత్రబృందం
Ellamma First Look
DSP Ellamma First Look : టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులకు చిత్రబృందం ఒక అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇప్పటివరకు తన సంగీతంతో కోట్ల మందిని ఊపేసిన ఆయన, ఇప్పుడు హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎల్లమ్మ' నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ 'పర్షి' అనే పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తుండగా, పోస్టర్ బయటకు వచ్చిన క్షణం నుంచే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మట్టి వాసనలతో కూడిన మాస్ లుక్.. 'పర్షి'గా డీఎస్పీ అదరహో
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దేవి శ్రీ ప్రసాద్ పూర్తిగా రెట్రో రగ్డ్ అవతార్‌లో, ఊరమాస్ పల్లెటూరి కుర్రాడిగా ఎంతో సహజ సిద్ధంగా కనిపిస్తున్నారు. "మీరు గుర్తుంచుకునే పేరు.. మీరు ఎప్పటికీ మరచిపోలేని ప్రయాణం" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఈ లుక్‌ను పరిచయం చేశారు. పోస్టర్ డిజైన్ , డీఎస్పీ లూకే ఈ సినిమా మట్టి కథాంశంతో, భావోద్వేగాల మేళవింపుగా ఉండబోతోందని స్పష్టం చేస్తున్నాయి. తొలిచిత్రంతోనే దేవి శ్రీ ప్రసాద్ ఇటు నటుడిగా, అటు మ్యూజిక్ డైరెక్టర్‌గా ద్విపాత్రాభినయం తరహాలో రెంటింటినీ సమాంతరంగా బ్యాలెన్స్ చేయబోతున్నారు.
వేణు యెల్దండి మార్క్ కాంబినేషన్.. దిల్ రాజు గ్రాండ్ ప్రొడక్షన్
తన తొలి చిత్రం 'బలగం'తో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ప్రతిభావంతుడైన దర్శకుడు వేణు యెల్దండి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో 'ఎల్లమ్మ'పై టాలీవుడ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) పతాకంపై అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వేణు రాసుకున్న కథలోని ప్రాణాన్ని, దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జీని కలిపి ఒక విజువల్ వండర్‌గా స్క్రీన్ పైకి తెచ్చేందుకు మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు.
పాన్ ఇండియా రేంజ్‌లో రచ్చ.. కథానాయిక ఎవరబ్బా.?
పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో డీఎస్పీ సరసన నటించే హీరోయిన్ వివరాలను చిత్రబృందం ఇంకా గుప్తంగానే ఉంచింది. అయితే వేణు యెల్దండి సినిమాల్లో పాత్రల ప్రాధాన్యత ఎంత బలంగా ఉంటుందో అందరికీ తెలిసిందే కాబట్టి, ఈ సినిమాలోనూ హీరోయిన్ క్యారెక్టర్ ఎంతో కీలకంగా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.




