Adarsha Kutumbam: వివాదంలో ‘ఆదర్శ కుటుంబం’.. సినిమాలో తమ పాట వాడరంటూ రచ్చ
Adarsha Kutumbam: ‘పర్ణశాల’ చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో అనుమతి లేకుండా వాడటంపై నిర్మాత మంచి వెంకట్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
Adarsha Kutumbam: వివాదంలో ‘ఆదర్శ కుటుంబం’.. సినిమాలో తమ పాట వాడరంటూ రచ్చ
Adarsha Kutumbam: టాలీవుడ్‌లో చిన్న సినిమాల ప్రయాణం ఎప్పుడూ ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటుంది. తాజాగా ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై మంచి వెంకట్ నిర్మిస్తున్న ‘పర్ణశాల’ సినిమా చుట్టూ నడుస్తున్న వివాదం మరోసారి ఈ విషయాన్ని తెరపైకి తెచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలోని ఓ పాటను మరో సినిమాలో అనుమతి లేకుండా వాడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
‘పర్ణశాల’ చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఉపయోగించడం పట్ల నిర్మాత మంచి వెంకట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సినిమా విడుదల కాకముందే, పైగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదలైన పాటను ఇలా మరో చిత్రంలో వాడటం వల్ల తమ సినిమాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.చిన్న సినిమాలను బతికించాలని, కష్టపడి తీసిన చిత్రాలకు ఇలాంటి పరిణామాలు నిరుత్సాహాన్ని కలిగిస్తాయని ఆయన మీడియా ద్వారా కోరారు.
‘పర్ణశాల’ చిత్రం హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాల కలబోతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.వై.జి. భరత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను లక్ష్మీదేవితో పాడించి చిత్ర బృందం వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించింది. ఈ వినూత్న ఐడియా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.
చిన్న చిత్రాలకు ఇలాంటి ప్రచారాలు, మ్యూజిక్ అప్‌డేట్లే కీలకం. మరి ఈ వివాదంపై ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో, త్వరలో విడుదల కానున్న ‘పర్ణశాల’ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో వేచి చూడాలి.




