Epic - First Semester Trailer: అదరగొట్టిన 'ఎపిక్' ట్రైలర్.. దిల్ ఖుష్!

Epic - First Semester Trailer: 'బేబీ' కాంబినేషన్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ట్రైలర్ విడుదలైంది. #90s ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

Gagan kumar
Published on: 5 Sept 2026 10:12 AM IST
Epic - First Semester Trailer
X

Epic - First Semester Trailer: అదరగొట్టిన 'ఎపిక్' ట్రైలర్.. దిల్ ఖుష్!

Epic - First Semester Trailer: 'బేబీ' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి స్క్రీన్ పై మ్యాజిక్ రిపీట్ చేసేందుకు సిద్ధమైంది. వీరిద్దరి కలయికలో రాబోతున్న కొత్త యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్'. '#90s' వెబ్ సిరీస్‌తో విశేష ఆదరణ పొందిన ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను, విశేషంగా నేటి యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'నా పేరు ఆనంద్.. సారీ సారీ.. ఆదిత్య.. నాకు డైరెక్టర్ అవ్వాలని ఉంది.. సినిమాలో ఓ మ్యాజిక్ ఉంది..' అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. కథానాయకుడు విదేశాలకు వెళ్లడం, అక్కడి పరిణామాలు, నటీనటుల మధ్య సాగే ఆహ్లాదకరమైన లవ్ ట్రాక్ ఫ్రేమ్‌లలో చాలా రీఫ్రెషింగ్‌గా కనిపిస్తున్నాయి. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కనిపించే సన్నివేశాలు, ఆయన చెప్పే డైలాగులు ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కథ కేవలం రొమాన్స్‌కే పరిమితం కాకుండా లోతైన ఎమోషన్స్‌ను కూడా స్పృశిస్తుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. "లోన్ EMI కట్టడానికి డబ్బులు ఎందుకు పంపడం లేదు రా" అని తల్లి నిలదీయడం, దానికి "కన్నప్పుడు కాలేజ్ ఫీజ్ కూడా కట్టకుంటే ఇంకెందుకు మమ్మీ" అంటూ హీరో ఇచ్చే సమాధానం ప్రేక్షకుల్లో ఒక్కసారిగా ఎమోషనల్ ఫీల్‌ను కలిగిస్తోంది. ఇక బ్రేకప్, రిలేషన్‌షిప్‌ల గురించి హీరో, హీరోయిన్లు చెప్పే డైలాగులు యువత మనసులను హత్తుకునేలా ఉన్నాయి. ఒక బంధం ఎప్పుడు 'ఎపిక్'గా మారుతుందో చెప్పే చివరి సంభాషణలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు అందిస్తున్నారు. అజీమ్ మహ్మద్ కెమెరా మెరుపులు, నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ ట్రైలర్ విజువల్స్‌ను మరింత గ్రాండ్‌గా మార్చాయి. ఫణి కె వర్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, వెంకట్ ఉప్పుటూరి, వీఎమ్ఆర్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు తోడు ఈ ట్రైలర్ కూడా విశేష స్పందన తెచ్చుకోవడంతో సెప్టెంబర్ 11న బాక్సాఫీస్ వద్ద మరో ఫీల్-గుడ్ హిట్ ఖాయమని సినీ ప్రియులు భావిస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story