Samantha And Naga Chaitanya: ఒకే వేదికపై సమంత, నాగచైతన్య.. విడాకుల తర్వాత ఇదే తొలిసారి
Samantha And Naga Chaitanya: నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ నారంగ్ రిసెప్షన్‌లో నాగచైతన్య-శోభిత, సమంత-రాజ్ నిడిమోరు జంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Samantha And Naga Chaitanya: ఒకే వేదికపై సమంత, నాగచైతన్య.. విడాకుల తర్వాత ఇదే తొలిసారి
Samantha & Naga Chaitanya: టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ ఎక్స్-కపుల్ నాగచైతన్య, సమంత మరోసారి ఒకే వేదికపై మెరిశారు. 2021లో విడాకుల తర్వాత వీరిద్దరూ ఇలా ఒకే ఫంక్షన్‌లో కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఏషియన్ సినిమాస్ అధినేత, ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ నారంగ్ వివాహ రిసెప్షన్ శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున వంటి దిగ్గజాలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు. అయితే అందరి కళ్లు మాత్రం నాగచైతన్య, సమంతలపైనే నిలిచాయి.
కొత్త జంటలతో కనువిందు
ఈ వేడుకలో సమంత తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి హాజరయ్యారు. వారిద్దరూ చిరునవ్వుతో వేదికపైకి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. మరోవైపు, అక్కినేని కుటుంబం తరపున నాగార్జున, అమలతో కలిసి నాగచైతన్య తన భార్య శోభితా దూళిపాళతో జంటగా విచ్చేశారు. నాగచైతన్య, శోభిత జంట వేదికపై వధూవరులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. వీరిద్దరూ విడివిడి సమయాల్లో వేదికపైకి వచ్చినప్పటికీ, ఒకే ఫంక్షన్‌లో అందరి సమక్షంలో కనిపించడం అరుదైన విషయంగా మారింది.
'ఏమాయ చేసావె' నుంచి విడాకుల వరకు..
2010లో 'యే మాయ చేసావె' సినిమాతో మొదలైన వీరి ప్రయాణం, ఏడేళ్ల ప్రేమ తర్వాత 2017లో పెళ్లి పీటల వరకు వెళ్ళింది. అయితే, 2021లో ఇరువురు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాలక్రమేణా వారు తమ వ్యక్తిగత జీవితాల్లో ముందుకు సాగి, కొత్త బంధాలను ఏర్పరుచుకున్నారు. ఈ రిసెప్షన్‌కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. జీవితంలో ఎవరి దారి వారు చూసుకున్నా, వృత్తిపరంగా ఇలాంటి వేడుకల్లో ఎదురుపడటం సహజం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మాజీ జంట తమ వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి గౌరవప్రదంగా వ్యవహరిస్తున్న తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు.




