Cake u Walk u Song : ఫహద్ ఫాజిల్ ఫుల్ జోష్.. ‘కేకు వాకు’తో రచ్చ.!
Cake u Walk u Song : విలక్షణమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్, 'పుష్ప' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత..
fahadh faasil
Cake u Walk u Song : విలక్షణమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్, 'పుష్ప' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సరికొత్త తెలుగు చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం అవుతుండగా, ఇప్పటికే విడుదలైన టీజర్‌కు విశేష ఆదరణ లభించింది.
జోష్ నింపిన 'కేకు వాకు' ప్రోమో సాంగ్
తాజాగా ఈ చిత్రం నుంచి ‘కేకు వాకు’ అనే మ్యూజిక్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. యువ సంగీత దర్శకుడు కాల భైరవ అందించిన స్వరాలు, బీట్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిత్రంలో ఫహద్ ఫాజిల్ పోషిస్తున్న 'సూరి' అనే విలక్షణమైన పాత్రను, అతని పిచ్చి తనాన్ని ఓ ప్రత్యేకమైన సెటప్‌లో ఈ పాట ద్వారా పరిచయం చేశారు. కాల భైరవ, ఫహాద్ ఫాజిల్, సారా కాంబినేషన్లో ఈ స్పెషల్ వీడియోను చాలా క్రేజీగా తెరకెక్కించారు. ప్రారంభంలో మెల్లగా సాగే ఈ పాట, కాల భైరవ థంపింగ్ బీట్స్‌తో ఎంట్రీ ఇవ్వగానే ఒక్కసారిగా హై ఎనర్జీ మోడ్‌లోకి మారిపోతుంది. సంగీతం అందించడమే కాకుండా, వీడియోలో కాల భైరవ వేసిన డ్యాన్స్ స్టెప్స్ కూడా కట్టుకునేలా ఉన్నాయి.
సూరి మాస్కు తగ్గ క్యాచీ లిరిక్స్
ఈ పాటకు కాల భైరవ, ఎంసీ హరి కలిసి క్యాచీ సాహిత్యాన్ని అందించడమే కాకుండా, తామే స్వయంగా పాడి పాటలో ఫుల్ ఎనర్జీ నింపారు. 'సూరి' అనే పాత్ర డేర్‌డెవిల్ నైజాన్ని, అతనికి ఎలాంటి కష్టమైన పనైనా ఎంత సులువుగా ‘కేక్వాక్’లా అయిపోతుందనే విషయాన్ని లిరిక్స్ ద్వారా చక్కగా వివరించారు. ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాజమౌళి రియాక్షన్ వైరల్
ఈ పాటపై ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రశంసలు కురిపించారు. "కేకు వాకు... వినగానే వైబ్ అయ్యేలా ఎంతో ఫన్‌గా ఉంది. ఇక 'సూరి'గా ఫహద్ ఫాజిల్ ఎక్కడికి వెళ్లినా తన పిచ్చితనంతో రచ్చ లేపడం ఖాయం" అంటూ పోస్ట్ చేశారు. రాజమౌళి రియాక్షన్‌తో ఈ పాట సోషల్ మీడియాలో మరింత ట్రెండ్ అవుతోంది.




