Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు.. 'ఫౌజీ' మూవీ పోస్ట్‌పోన్.. ప్రకటించిన నిర్మాత!

Fauzi: ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ఫౌజీ' సినిమా విడుదల వాయిదా పడినట్లు నిర్మాత మైత్రి రవిశంకర్ వెల్లడించారు.

Ravi
By Ravi
Published on: 22 Sept 2026 5:44 PM IST
Fauzi
X

Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు.. 'ఫౌజీ' మూవీ పోస్ట్‌పోన్.. ప్రకటించిన నిర్మాత!

Fauzi: భారతీయ సినీ పరిశ్రమలో పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్న ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో 'ఫౌజీ' ఒకటి. ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ నుంచి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్లు నిర్మాత మైత్రి రవిశంకర్ అధికారికంగా వెల్లడించారు. ఈ వార్త ప్రభాస్ అభిమానులను కొంత నిరాశకు గురిచేసినప్పటికీ సినిమాపై అంచనాలు మాత్రం తగ్గలేదు.

ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెబుతున్నామని ఫౌజీ సినిమా కొంచెం వెనక్కి వెళ్తోందని నిర్మాత మైత్రి రవిశంకర్ పేర్కొన్నారు. అయితే సినిమా మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ను మళ్లీ ఆ రేంజ్‌లో వెండితెరపై చూడలేదని, ఈ సినిమా ఆ స్థాయిలో గొప్పగా ఉంటుందని ప్యారడైజ్ ఈవెంట్‌లో తెలిపారు. కంటెంట్ విషయంలో రాజీ పడకుండా అత్యుత్తమ అవుట్‌పుట్ తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో డిసెంబర్‌లో విడుదల కావాల్సిన 'ఫౌజీ' సినిమా 2027కు వాయిదా పడినట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రకటనతో ఆ వార్తలపై పూర్తి స్పష్టత వచ్చినట్లయింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా నిర్మాణానికి సుమారు రూ. 250 కోట్లు నుంచి రూ. 300 కోట్ల వరకు కేటాయించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.

ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా వాయిదా పడినప్పటికీ చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. సినిమా విడుదలకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.