Film Federation: డాన్స్ మాస్టర్స్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర భేటీ!

Film Federation: ఈ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, నిర్మాతల సమక్షంలో జానీ మాస్టర్, సుమలతలతో అత్యవసర భేటీ ప్రారంభమైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 July 2026 11:44 PM IST
Film Federation
X

Film Federation: డాన్స్ మాస్టర్స్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర భేటీ!

Film Federation: తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో అత్యవసర సమావేశం.ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ సమక్షంలో ఈ కీలక భేటీ.

ఈ సమావేశానికి డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతతో పాటు జానీ మాస్టర్ కూడా హాజరయ్యారు.ప్రస్తుతం అసోసియేషన్‌లో నెలకొన్న వివాదాస్పద పరిస్థితులు, సభ్యుల మధ్య విభేదాలు, సంఘం భవిష్యత్ కార్యాచరణ, పరిశ్రమపై పడుతున్న ప్రభావం వంటి అంశాలపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం.

ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్‌తో పాటు తెలుగు సినీ పరిశ్రమలో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.సమావేశం ముగిసిన అనంతరం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story